2023-07-29 17:16:00 by ambuda-bot

This page has not been fully proofread.

1
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
రమ్యయు, దేవేంద్రుని పట్టపు దేవియైనది, దేహధారులకు
సౌమ్యమైనది యగు మాత ప్రకాశించుచున్నది.
 
6. త్రిలోకములను భరించుట కింద్రునకు బుద్ధిని, బలమును ఇచ్చు
దేవి ప్రకాశించుగాక.
 
ఈ జగత్తునందు వ్యాపించియున్నది, మానవ హృదయము
లందు గుప్తమై యున్నది, పుణ్మాత్ముల కాపురా లైనదియగు
శచీ దేవి నా యొక్క దైవము.
 
5.
 
7.
 
8.
 
9.
 
10.
 
11.
 
12.
 
27
 
ఆకాశమందు నిరుపమానశక్తిగా నున్నది, ఆకాశమున కావల
నిర్మల చిత్తుగా నున్నది, స్వర్గమందు సుందర స్త్రీగా నున్నది
యగు శచీ దేవి నా యొక్క దైవము.
 
ఇంద్రునకు శస్త్రము, ముల్లోకములకు వస్త్రము (ఆకాశమే
వస్త్రము) అగుచు, శాస్త్రములచే నుతింపబడు గుణములుగల
శచీ దేవి నా యొక్క దైవము.
 
యోగయుక్తుడై భజించువాని యాంతర్యమున నిరుపమాన
సుఖము నిచ్చుచు, బాహ్యమున కవచమై రక్షించు శచీదేవి
నా యొక్క దైవము. (ఇంద్రాణీ విద్యాఫలమిది)
 
బలవంతులందు వీర్యరూపముగను, మతిమంతులందు బుద్ధి
రూపముగను, కాంతిమంతులందు తేజోరూపముగను నున్న
శచీదేవి నా దైవము.
 
తానొక్క తెయే సృష్టి చేయుచు, తానే ధరించుచు (స్థితి), తానే
లయ మొనర్చు శచీదేవి నా దైవము.