2023-07-29 17:15:59 by ambuda-bot

This page has not been fully proofread.

. 3.
 
18.
 
19.
 
20.
 
21.
 
ఇంద్రాణీ సప్తశతీ
 
జగత్తున కాకాశమే తల్లి, ఆకాశమే తండ్రి దృష్టిగోచరమగు
సర్వము ఆకాశముచే
వ్యాప్తమై ప్రకాశించుచున్నది.
 
23
 
ధూళిరూపమైన ఆకాశముకంటె ధూళిరహితాకాశము వేఱుగా
గలదు. దాని కన్యమైన దింకొకటి యున్నది. ఈ మూడింటి
కంత్యమందు పరాకాశము గలదు.
 
(పరాకాశము నిర్గుణము. అదియే గుణశ్రయమును బొంది
మూడు స్థితులుగా వ్యాపించెను. 11వ శ్లోకము చూడుడు.
వీనినే భూర్భువస్సువర్లోకము లనిరి. అంత్యమున కేవల మహి
మమే పరాకాశమగును. సచ్చిదానంద త్రిరూపాత్మక వస్తు
వీ విధముగా మహిమచే రూపత్రయలక్షణమై జ్యోతిరాకృతిగా
ప్రకాశించినట్లు భావించవలెను.)
 
దేవీ ! లోకముల నెడి మహారంగమందా వ్యోమతనువును,
దాని యంత్యమందు శుద్ధతమమైన నిన్నును తెలిసికొను
చున్నాము.
 
(ఆమె పరాకాశ స్వరూపిణియైనను స్థూల - సూక్ష్మ - కారణ
శరీరములు గల తనువును మనము పొందినట్లే త్రైవిధ్యమును
బొందిన ఆకాశతనువుచే పొంది, యంతటను వ్యాపించెను.
ఆ రూపమును ధ్యానించువారందలి పరదేవతాతత్వమును
 
తెలియుదురు.)
 
ఓ దేవీ! పూర్ణమైన నిన్న దితిగాను, శక్తిగాను, శచిగాను,
ప్రణవముగాను, గౌరీ దేవిగాను వచించుచున్నారు.