2023-07-29 17:15:59 by ambuda-bot

This page has not been fully proofread.

స. 3.
 
10.
 
11.
 
12.
 
13.
 
14.
 
15.
 
16.
 
17.
 
ఇంద్రాణీ స ష్తశతీ
 
ఓ తల్లీ ! నీవు కశ్యపబ్రహ్మ కదితివైతివి, రుద్రునకు శిన వైతివి,
యింద్రునకు శచి వైతివి. నీవే శక్తినై యుంటివి.
 
(పురుషలక్షణమునుగూడ భరించు శక్తినైతివని భావము.)
 
21
 
ప్రాణమని, ప్రణవమని, ఆకాశగత తేజస్సని త్రిగుణములతో
నున్న దొకే వస్తువు, వస్తువులు మూడుగా లేవు.
 
ఓ యంబా ! శక్తికి, శక్తునకు భేదము జ్వాలకు, అగ్నికి గల
భేదమువంటిది. మాటయే భేదమును గలిగించుచున్నది.
(వస్తుతః `లేదని భావము.)
 
కనబడు సర్వము భుజించు నో దేవీ ! పురుషనామ స్తోత్రములు
నీకు యుక్తమే కదా. (అయినను,)
 
ఓ యంబా ! సద్రూపబ్రహ్మకు సంతోషమునిచ్చునట్టి నీకు
స్త్రీ నామ స్తోత్రములు మాత్రము శోభనిచ్చుచున్నవి.
 
తల్లీ ! విద్వాంసులు గుణములేని దానిని సద్బహ్మగా చెప్పు
చున్నారు. నీవు సగుణ బ్రహ్మ వైతివి. (8వ శ్లోక ముచూడుడు)
 
ఓ దేవీ ! శబ్దాదులతో గూడక యున్నది నిర్మల బ్రహ్మమగును.
శబ్దాదులతో గూడిన నీ వార్యులకు హిత కారిణి వగుచుంటివి.
(స్తుతింప వీలగు రూప మిదియే)
 
ఓ తల్లీ ! పరబ్రహ్మము సాక్షిగా నుండును. నీవు సకల
జగత్తులయొక్క సర్వవిధ కార్యములను జేయుదువు.