2023-08-06 06:17:48 by srinivas.kothuri

This page has been fully proofread once and needs a second look.

స్త 3.
 
21.
 
22.
 
23.
 
24.
 
25.
 
1.
 
2.
 

 
ఇంద్రాణీ స ప్తశతీ
 

 
21.
భూతములకు తల్లియైన భూమి యొక్క మహిమను బూర్తిగా

చెప్పలేనట్లే, యే గోళమహిమను గురించియైన నొక్కొక్క

భాగముకంటే హెచ్చుగా చెప్పజాలకుండిరి.
 
17
 

 
22.
కొండలయొక్క తాళ్ల సంఖ్య, నదుల యొక్క యిసుక (తిన్నెల)

సంఖ్య చెప్పజాలనట్లే, గోళములు సంఖ్యయు చెప్పశక్యము
 
కాదు.
 
23.
ఓ దేవీ ! ఇట్టి యసంఖ్యాకమైన గోళము లే నీ శరీరమందు

రోమములు (అల్పాంశలు). ఇంతమాత్రముచేతనే కొనియాడ

దగియున్న నీ భాగ్యము వ్యాఖ్యానమయ్యెను.
 

 
24.
ఓ తల్లీ! దేవేంద్రుని భుజములందు నీవుండి విశ్వమును

వహించుచుంటివి. వాసిష్ఠుని (గణపతిముని) బుద్ధియంనుదు నీవుండి

ఆర్యులను వహింపుము.
 

 
25.
భువనములకు పూర్వమే యున్న శక్తిని, యీశ్వరుని తను

మధ్యను (భార్యను, ఇంకొక అర్ధము శరీరమధ్యమందుండు

నాకాశరూపిణిని) భక్తునియొక్క యీ తనుమధ్యావృత్తములు
 

పొందుగాక.
 

 
______________________________________
 
1.
ఇంద్రాణియొక్క శుభ్రమైన హాసకాంతులు నా హృదయ

మందు విమలమైన ప్రజ్ఞ నిచ్చుగాక.
 

 
2.
దుఃఖమును హరించు ఇంద్రాణీ కృపావలోకములు భారత

భూమికి క్షేమకరము లగుగాక.
 

 
17