2023-07-29 17:16:41 by ambuda-bot

This page has not been fully proofread.

స. 4.
 
24.
 
25.
 
ఇంద్రాణీ స స్తశతీ
 
ఓ కరుణామయీ! వర్ణనాతీతములైన లక్షలకొలఁది గుణములు
కలదానా ! భారతదేశ రక్షణార్ధ విగీతములను రచించిన
నరసింహసుతుడైన గణపతిని సమర్ధుని గావింపుము.
 
ఓ తల్లీ! 'సులలిత తామరస' వృత్తములచే సమా ప్తము గావింప
బడి, చెవులకింపగునట్లు నిబద్ధమైన యీ వరనుతిబంధమును
నీవు పూర్తిగా విని నా యభిలాషను నెర వేర్పుము.
 
ఇట్లు,
 
శ్రీ భగవన్మహర్షి రమణాం తేవాసియు,
న ర సిం హ పుత్రుడును, కావ్యకంఠ బిరు
దాంకితుడును, వాసిష్ఠగోత్రనామకుడును
అగు గణపతిమునిచే విరచితమైన
ఇంద్రాణీ సప్తశతి సమా ప్తము.
ఓం ఇంద్రాణ్యర్పణమస్తు.
 
265
 
జయంతి ప్రింటర్సు, కాకినాడ.