2023-07-29 17:16:41 by ambuda-bot

This page has not been fully proofread.

స్త. 4.
 
19.
 
20.
 
21.
 
22.
 
23.
 
263
 
ఇంద్రాణీ స స్తశతీ
 
ఇంద్రాణియొక్క కళను బొంది (ఉగ్రకళ, శాంతకళ యని
శక్తి రెండు విధములుగా నుండును. ఈ శ్లోకమం దుగ్ర
కళను స్తుతించి, తరువాత శాంత కళను కవి పేర్కొనును.)
యుగ్రమైనది, దుష్ట జనులను నాశన మొనర్చు పటుత్వము గల
గోళ్ల కొనలు గలది, అతి బలమైనది, కృత్తశిరస్సు గలదియైన
ప్రచండచండి నా హృదయమందుగల విషతుల్య పాపములను
 
సంహరించుగాక.
 
ఇంద్రాణీకళతో గూడినది, పండితులచే పొగడబడు సద్గుణ
గలది యగు ద్రౌపది నా కంతటను వైభవముతో
 
ములు
 
గూడిన మంగళములను సమకూర్చుగాక.
 
ఓ మనుజకుమార జనిని ! పాపవశమువలవ నంతటను ని సైజు
డనై దాసుడనగు నన్ను రక్షింపుము.
 
ఇంద్రుని మందిరమునకు నాయకురాలై, మన్మధుని బోషించు
సుందర శరీరముగల శచీదేవి యొక్క- కీర్తి గానముచే వ్యాపిం
 
చిన గణపతి వాక్కునందామె ప్రతిఫలించుగావుత.
 
నా హృదయమను పద్మము వికసించుగాక (ఈ స్తుతిగీతము
వలన), అందు శచీదేవి సంబంధమైన యీ గీతమా మెకు
విలాసము నిచ్చుగాక, సర్వేష్ణార్ధములు నిహమందు (తత్ఫల
ముగా) వ్యక్తమగుటకు స్ఫురించుగాక, (ఆ యిష్టార్ధ ప్రాప్తిచే)
నా సామర్ధ్య మధికమగుగాక.