2023-07-29 17:16:42 by ambuda-bot

This page has not been fully proofread.

14.
 
15.
 
16.
 
17.
 
18.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
లక్ష్మి నివసించుటకు రెండు గృహములవలెనుండి, యాశ్రిత
భక్తజనులు చేరదగినవై, బహురమ్యమై, యడ్డులేని గమనము
గలిగి, బాలసూర్యప్రకాశమానమై యొప్పు ఇంద్రాణీ పదకమల
ద్వయము నా హృదయమందు బ్రకాశించుగాక.
 
261
 
శరీర ముయొక్క మీది (స్థూల) భాగమందు వ్యాపించి, కుండ
లినీ గృహముగాగలది, జ్వలించు నగ్ని కాంతులచే మనోహర మై
యున్నది, పుష్టిగలది, పవిత్రమైనది యగు నీ యింద్రాణి
నా శిరఃకమల చంద్రుని ప్రకాశింపజేయుగాక.
 
ఏ పరాశక్తి గగనమందు రాజిల్లుచున్నదో, ఏది నా హృదయ
JAN
 
మందు ప్రకాశించుచున్నదో, బహు వీర్యవంతమైన ఆ రెండు
శక్తులు నా హృదయమున మిళితమై (బాహ్యాంతర భేదములేక
దేవతలందువలె) నా కార్యసాధన జేయుచు నాకు సుఖము
నిచ్చుక
 
(అహంకార మమకారములను దొలగించవలెనని భావము.)
 
మనోవాక్కాయ కర్మలు మూడింటిని హరించు నింద్రాణి
(అన్న మయ
మనోమయకోశములను బాలించునది యను
 
భావముగూడ కలదు), నా మనోరధమును బోషించి నెర వేర్చు
 
గాక, నా పాపఫలమును నశింపజేయుగాక,
 
మేఘములను చలింప జేయుటవలన ప్రసిద్ధ కీర్తినొందినది, విస్తార
తేజస్సుగలది, జన్మగల వారికి జనని యగునది, యింద్రుని
మోహింప జేయు నట్టిదియైన మూర్తి నాకు కుశలము జేయుగాక.