2023-07-29 17:16:40 by ambuda-bot

This page has not been fully proofread.

ఇంద్రాణీ స ప్తశతీ
 
7. ఆకాశశరీరిణియై ఆమె విపులముగా వ్యాపించిన సకల జగత్తుల
కంటె శ్రేష్ఠమైన (జగత్తులకు మించి వ్యాపించుటచే నాకాశము
శ్రేష్ఠము, జ్యేష్ఠము కూడ అగును) ప్రభుపదమును బొంది
(
యున్నది. ప్రతిమా నవ దేహమందు ప్రవహించుచు విహరించు
చున్నను పుట్టుక లేక యున్న ఆయా కాశరూపిణి నా హృదయ
మందు క్రీడించుగాక.
 
8.
 
9.
 
257
 
(అనిత్యమైన వికృతచలనకూపములకంటె నిత్యచలనాత్మక మైన
ఆకాశము శ్రేష్ఠము. ఇదియే సర్వప్రవాహములకు మాతృక
వంటిది.)
 
సమర్థమైన కులకుండాగ్ని జ్వాలలుగలది, లెస్సగా నుదయించిన
భానునివంటి హృదయప్రభావమే లీలగాగలది, శిరస్సునందు
ద్రవించు చంద్రకళామృతధారలు గలదియైన ఉదారమగు దేవి
తన భ క్తజనమును రక్షించుగాక.
 
(ప్రతిమానవునియందు నా కాశరూపిణియై వ్యాపించియున్న దేవి
తదాకాశముద్వారా చైతన్య మునిచ్చి యనుగ్రహించునప్పుడు
మాతృలక్షణము త్రివిధములై మూలాధార, హృదయ మస్తక
స్థలములం దెట్లుండునో వచింపబడెను.)
 
ఇక్కడ ముందున (సృష్టియందు, లేదా శరీరక్రియలందు)
విషయాకృతిగాను అక్కడ వెనుకను (ఆకాశమున నుండు
నిర్గుణ పరాస్థితియందు) మిగుల నిర్మలముగాను నుండి (ఇది
దివ్య స్త్రీరూప చైతన్య ము), విశ్వమును గృహముగా బొందినను
భువనములకం టె వేఱుగా నిర్దోషమై యతి శక్తివంతమైయుండు
(బుద్ధిసంబంధమగు) రూపము నన్ను రక్షించుగాక,