2023-07-29 17:15:58 by ambuda-bot

This page has not been fully proofread.

8.
 
9.
 
10.
 
11.
 
12.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
సమృద్ధిమంత మర్ధమగును, సంతోషమునికాదు. ఆకాశ శరీర
మునకు వస్తుసమృద్ధినిచ్చువా డానందస్వరూపుడు. అతని
స్వరూపమందొక అంశమాత్ర మా కాశము. దాని నావరించి
స్వరూపముండుట ఆలింగనమగును.
 
13
 
ఓ యంబా ! పగటిపూట ప్రజ్వలించుచున్న సూర్యుని నీవు
మాణిక్య కిరీటమువలె ధరించు చుంటివి.
 
(ఆకాశ రూపిణియెక్క వైభవమిది. శక్తికి రెండు రూపములు
వచింపబడుచున్నవి. అందొకటి యాకాశరూపమై కిరీటమును
ధరించి విశ్వపాలన మొనర్చు ప్రభ్వీరూపము ఇంకొకటి దివ్య స్త్రీ
రూపము. రెండవది దిగువ 13, 14 శ్లోకములచే చెప్పబడుచున్నది)
 
తల్లీ ! తెల్లని కాంతిగల యీ నక్షత్రసమూహములే రాత్రిభాగ
మున నీ శిరస్సునందు పుష్పములవలె నున్నవి.
 
ఓ శచీ ! రాజ్యమును పాలించు కాలము పగ లేగదా ! భర్తతో
రతిసల్పు కాలము రాత్రియేకదా !
 
( మొదటి దాకాశరూపమునకు, రెండవది
జెందును.)
 
రూపమునకు
 
ఓ యాకాశ శరీరిణీ ! చంద్రుడు లేనట్టి, నిశ్శబ్ద తరంగములు
గలిగినట్టి చీకటి రాత్రులందు నీవు భర్తను రమింపజేయు
చుంటివి. నిశ్చయము.
 
ఓ దేవీ ! దట్టమైన నక్షత్రములనెడి పూలదండలతో విభ్రాజ
మానమగు కేశములున్ను, చీకటియను నల్లని వస్త్రమున్ను
గలిగి నీవు శాంతముగా నున్నను భయంకరముగా నుంటివి.