We're performing server updates until 1 November. Learn more.

2023-07-29 17:16:40 by ambuda-bot

This page has not been fully proofread.

24.
 
25.
 
1.
 
2.
 
3.
 
ఇంద్రాణీ సప్తశతీ
 
ఆ యింద్రాణి ధనశక్తి బంధుబలము లన్నింట హీనుడై యున్న
గణపతిమునిని కృపతో జూచి, భారత దేశ శుభము నొడగూర్చు
వారిలో బ్రథమునిగా జేయుగాక.
 
253
 
సుకవిరాట్టైన గణపతియొక్క యీ 'స్రమితాక్షర' వృత్తము
లధిక కాంతి గుణ శక్తులు గలిగిన ఇంద్రాణీదేవిని సంతోషము
తోడను, నేర్పుతోడను వినునట్లు చేయుగాక.
 
చంద్రునివలె ధవళ మైనది, చీకటి సమూహములను నివారింప
సమర్ధమైనది, యెన్ని జన్మములు పాపములనైనను నశింపజేయు
నట్టిదియైన యింద్రాణీ మందస్మితలేశము నాకు శుభము
గూర్చుగాక.
 
దేవేంద్రుని రాణియైన సవిత్రి-మార్గము తెలియక విషణురాలై
చిర కాలమునుండి గతికోల్పోయి స్తంభించియున్న భారత
 
భూమిని రక్షించుగాక.
 
ఈ భువనసృష్టికి పూర్వము నిరాకార నిర్మలమై యేది యంత
టను నుండెనో, మంగళప్రదమైన ఆ ప్రకృతి నా బుద్ధిని తీక్ష
మొనర్చుగాక. (అట్టి ప్రకృతినే పర దేవతయందురు)