2023-07-29 17:16:38 by ambuda-bot

This page has not been fully proofread.

స్త. 3.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
6. దేవతలచే పూజింపబడు రేణుకా చరణసేవ (లేదా ధ్యానము)
సకల రోగములను శమింపజేయును, పాపములను నశింప
జేయును, హృదయ కామ్యములను నెరవేర్చును.
 
(ఈ స్తవమునకుగల పారాయణఫలము గూడ నిట్టిదే యని
తెలియునది.)
 
7.
 
8.
 
9.
 
245
 
పరశురామ జననియైన రేణుక యొక్క పాదములమ స్మరించుట
వలన మనుజుల పాపపటలము నశించుచున్నది, భజించుటవలన
వాంఛిత ఫలము సిద్ధించుచున్నది..
 
ప్రథమమున భారతభూమికొఱకు నమ్రుడనైన నేను (అనగా
ప్రథమమున భూమియొక్క శ్రేయస్సును గోరి, దేవిని సేవించు
MIGANES
నేను), ఓ రేణుకా, బాలసూర్యునిబోలు నీ చరణమును శరణు
బొందుచుంటిని. ఇచ్చట నాకు నీచమృత్యువు గలుగకుండుగాక
( దేశవిముక్తి పోరాటములో)
 
ఆర్యులకు స్తుతిపాత్రనైన రామజననీ! (బాల) మార్తాండునివలె
బ్రకాశించు నీ చరణమును చిరకాలమునుండి యవిరళముగా
 
స్మరించుచున్న యీ జనుడు దేవ కార్యమును వహించి చేయు
టకు సమర్ధుడగుగాక,
 
దానికొఱకు
 
( దేశవిముక్తి నీశ్వర కార్యముగా, కవి తల చెను.
నిర్మాణమైన గాంధీయోద్యమము నట్లే భావించి కొంత చేయూత
నిచ్చిన స్వవిషయమును గుఱించి కవి యీ శ్లోకమందును
పూర్వశ్లోకమందును స్మరిం చెను.)