2023-07-29 17:16:38 by ambuda-bot

This page has not been fully proofread.

. .
 
21.
 
22.
 
23.
 
24.
 
ఇంద్రాణీ సప్తశతీ
 
నిగూఢ వైభవముగల పుణ్యములు ప్రకాశింపకుండగా, ఫల
ములనిచ్చు పాపములు ప్రకాశించుచుండగా. మనస్సు విక
లత్వము బొందియుండగా, తల్లీ. నీ చరణమే శరణు బొందు
 
చుంటిని.
 
241
 
ఓ యంబా ! శత్రువు సమర్థుడై యుండగా, రోగము భయం
·కరమై యుండగా, నమ్రులను రక్షించుటకు నిపుణురాల వైన
 
నీ చరణమును నేను శరణు బొందుచుంటిని.
 
ఓ తల్లీ ! దేవతాసమూహములు కిరీట మణికాంతుల నెడి కుండ
లినీ కిరణములను బొందినట్టి, మిగుల యెఱుపుగా నున్నట్టి, విప
త్తులను తొలగించి యజ్ఞానమును నశింపజేయునట్టి నీ చరణము
 
నాకు శరణము.
 
ఓ యీశ్వరీ ! వైభవము గోల్పోయిన నా యీ జన్మభూమిని
తిరుగ లక్ష్మీప్రధము గావించుకొనుటకు గణపతి హస్తమునకు
పటుత్వమునిమ్ము.
 
25. ఇంద్రాణీ దేవిపై గణపతి చే రచింపబడిన నిర్దుష్టమగు
'జలోద్ధత' గతి గల యీ స్తనము భారతదేశ జనులు భయ
మును బోగొట్టి వారిని రక్షించుగాక.