2023-07-29 17:16:37 by ambuda-bot

This page has not been fully proofread.

స్త. 2.
 
29
 
15.
 
16.
 
17.
 
18.
 
19.
 
20.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
బంగారమదృశ్యమైన నాయీకులము చాలకాలమునుండి నిరా
యుధమై, సర్వత్ర నిరాశజెందెను. ఓ తల్లీ ! స్వభావము చేత నే
మేల్కొన్నట్లున్న బుద్ధిచే వికాశముకొఱకు నీ చరణమును
 
శరణు బొందుచుంటిని.
 
239
 
ఓ అంబా ! వీరుల చరిత్రనశించి, పరిపాలకుల కథపోయి, ఋషి
వైభవము శూన్యమైయున్న నాయీకులము చిరకాలమునుండి
నా మనస్సును మాటిమాటికి వేధించుచున్నది. నీ చరణమునే
 
శరణు బొందుచుంటిని.
 
ఓ తల్లీ ! చిరకాలమునుండి (నిజ) స్మృతి మార్గమునుండియు
జారిపోయి, తపోబలమువలన గాని బుట్టనిదియునగు ఋషి
వైభవము నిప్పుడు తిరుగ నా స్వదేశము పొందుటకు నీ చర
 
ణమును శరణు బొందుచుంటిని.
 
ఓ కరుణామయీ ! కొట్టబడి, యణచబడి, కదల్పబడి, కల్లోల
పెట్టబడి యంతటను 1 రోదనముచేయు నా యీ
స్వ దేశము
మంగళయుతమగుటకు నీచరణము నేను శరణుబొందుచున్నాను.
 
ఓ పరా దేవీ ! విహరించు పాపాత్ముల నాశనముకొఱకు, ప్రపం
చమునకు మిత్రులయిన సత్పురుషుల మంగళముకొఱకు, స్వకీయ
మైన (మా) మనోబలము (మేము పొందుట) కొఱకు నీ చర
ణము నేను శరణు బొందుచుంటిని..
 
పాపాత్ములంతటను విజయము బొందుచుండగా, పుణ్యాత్ములు
బలహీనులై యుండగా, దుర్మార్గులకు ప్రియమైన యీ కలి
 
యుగము పక్వమై యుండగా, తల్లీ ! నీ చరణమును నేను శరణు
బొందుచుంటిని (కాలము మార్చుకొఱకు)