2023-07-29 17:16:36 by ambuda-bot

This page has not been fully proofread.

. .
 
4.
 
5.
 
6.
 
7.
 
8.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
పరా కాశరూపమందు గుణముతో గూడనిదానవే నీవు మూల
మైన సద్రూపునకు బుద్ధి లక్షణ వైయుంటివి (కర్తప్రచురణబుద్ధి),
యిచ్చటనున్న ఆ కాశ తనువుతో నీవు ప్రపంచమును పోషిం
చుచు రక్షించుచుంటివి. స్వరమనెడి గుణమునకు బలమునిచ్చు
ప్రాణేశ్వరి నై నీవు స్వర్గమం దింద్రుని ప్రియురాలి వైతివి. ఓ శచీ!
స్వరూప కథ యిది.
 
235
 
ఓ సురాసురస్తూయమానులాలా! పురాణ పురుషుడైన ప్రజాపతి
స్థానమందు నీవు 'అదితి' వై స్మరింపబడుచుంటివి. ఉత్కృష్ట
జనార్దనపదమందు 'లక్ష్మి' నై నీ వుంటివి. నాశనరహితమైన
సదాశివపదమందు నీవు 'శివ' నై యుంటివి.
 
సూర్యుని స్థానమున 'ఉష' వై, అగ్ని పదవియందు 'స్వధ' వై,
యింద్రపదమందు 'శచి' వే కవులచే నా యా స్థానముల
కుచితపదములతో పిలువబడితివి. వేదవాక్కులో మీ రుభ
యులు జ్ఞాతృ, జ్ఞానము లగుదురు.
 
అమేయుడు, నచింత్యుడు నగు పురాణపురుషునినీ కవులతని
సంబంధమగు వైభవములను దెలుపు పదములతో పిలుచు
చున్నారు. దేవీ ! నిన్ను గూడ
నిన్ను గూడ వారట్లే పిలచిరి. మతభేద
మందుల కే (అనగా వైభవ నామములందున్న భేదముచే) గలి
 
ఓ సవిత్రీ ! అకాశము, వాయువు, పరావాక్కు, వ్యాపించిన
తటిత్తు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, జలము, పృధ్వి-
సర్వము మీ యిద్దరియొక్క మైశ్వర్య స్వరూపమే.