2023-07-29 17:16:36 by ambuda-bot

This page has not been fully proofread.

. .
 
29
 
2.
 
3.
 
ఇంద్రాణీ 'స -ప్తశతీ
 
253
 
ముల్లోకములను; కనిన యింద్రవేయసి యత్యంత గత్తిహీను రా
లైనట్టి, నష్టబుద్ధియైనట్టి యీ భారత దేశము యొక్క దుస్థితిని
తన కృపతో గూడిన కటాక్ష కళచే నివారించుగాక.
 
కన్నబిడ్డ ననుగ్రహించు తల్లివలె.)
 
23
 
ఆదియందు ( అనగా విశ్వసృష్టికి పూర్వము) సచ్చిదానంద
త త్వస్వరూపుడై న 'యీశ్వరుని చిత్తువైయున్న నీవు విశ్వసృష్టి
కొఱకు పృథఙ్మతి వైతివి
 
(ఇక్కడ 4 రూపములు చెప్పబడెను. (1) కర్తయైన యీశ్వరుని
యందభిన్నయై, తత్త్వస్వరూపముతో నున్న చిత్తు తానేక ర్తయై
ప్రభుత్వరూపిణియై'మూలమందున్నది. (2)తరువాత సృష్టికొఱ
కీశ్వరస్వరూపము తన మహిమచే వ్యాపించగా, మహిమా
లక్షణమం దీశ్వరునే కర్తవలె ప్రచురించుట కహమ్మహమ్మను
స్ఫూర్తులనిచ్చునొ కానొక భాసమానలక్షణ యయ్యెను. ఇదియే
సగుణ బ్రహ్మలక్షణము. 'అయితిని' అను నర్థమిచ్చు హృత్ +
అయం=హృదయమను నామముచే ప్రసిద్ధమైన రూపమిదియే.
(3) తరువాత ( మహీమయొక్క వ్యాపారముచే చిమ్మబడుచున్న
యీశ్వర సంపదనుధరించుటకు) ఆకాశశరీరిణి నైతివి. (4) అటు
తరువాత (యీశ్వరునినుండి విభాజ్యమై చిమ్మబడు వీర్య వస్తు
సంపద మహిమయుత మైయున్నను, ఈశ్వర చైతన్యము నీయనిదై
జడత్వస్థితినిబొంది యీ కాశగర్భమందుండగా, 'అహరి' చైతన్య
మును బ్రవేశ పెట్టిన అనుగ్రహ వ్యాపారమనెడి మాతృలక్షణ
ముచే) సురపతికి 'నేత్రామృతమగు పద్మనేత్రమైన స్త్రీరూపిణి
వైతివి. (ఇదియే యనుగ్రహ దేవతా స్వరూపము)