2023-07-29 17:16:35 by ambuda-bot

This page has not been fully proofread.

స్త. 1.
 
16.
 
17.
 
18.
 
19.
 
20.
 
21.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
ఓ జననీ ! వజ్రతనువు, ప్రజ్వలించు తేజస్సుగల నీ వొక వీక్ష
ణముచే శత్రువును తొలుత విగత తేజస్సుగలవానిగా జేసి, వాని
ధైర్యమును నశింపఁజేయగా, బిదప వానిపై సురపతి పరాక్ర
మమును చూపును.
 
229
 
ఇంద్రాణీ పాదపద్మములకంటె జగత్తులో మానవుల మననమున
కుచితమైన దింకొకటి లేదు. రమణీయమైన ఆమె ముఖపద్మము
కంటె దర్శన యోగ్యమైనది నరుల కింకొకటి లేదు.
 
మునులచే గానముచేయబడు చరిత్రగలది, స్వర్గ మధ్య
ములను (స్వర్గమ నెడి దివ్య తేజోలోక మును, ఆకాశమ నెడి
మధ్యమలోకమును, భూమిని) నిజబలముచే చలింపజేయునది,
యింద్రుని దృక్కుల కమృతప్రాయమైనది యగు నింద్రాణి
 
నాకు శరణము.
 
అతిశాంతరూపిణి, పుణ్యాత్ములకు హిత మొదర్చునది, తనయందు
గల సంతత భక్తిచే మనస్సునందుండునది యైన ఇంద్రాణి
 
నన్ను గతిగలవానిగా జేయుగాక,
 
ఓ జననీ! నమ్రతతో గూడిన వినయముతో స్మరింపదగినది, కుల
కుండాగ్ని నుండి ప్రసరించునది, ఋతశరీరములందు నూత్న వేగ
ముతో వ్యాపించునదియైన నీ కళచే నేను రాత్రులను వెళ్ల
బుచ్చెదను.
 
ఓ దేవీ ! (నీ వొక్క సారియైన నాకు మంగళవాక్యము వేగ T
 
ముగా జెప్పుము.