2023-07-29 17:16:33 by ambuda-bot

This page has not been fully proofread.

స్త. 4.
 
19.
 
20.
 
21.
 
22.
 
23.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
తన కుమారుడైన రంగపతియొక్క సమీపమున వాసము
చేయుచున్నది, నమ్రులకు కార్యసిద్ధి నిచ్చునది, ఛేదింపబడిన
శిరస్సు గలదియగు నింద్రాణీ కళ నాకు బ్రియములు సమ
కూర్చుగాక.
 
217
 
రఘురామాలయ
 
(ఈ క్షేత్రములో రేణు కాలయమునకు కొంచెము దూరములో
ముండుట వింత. ఒకప్పుడిది పరశు
రామాలయము కావచ్చును లేదా పరశురాముని యుత్తర
చరిత్రమే రఘురామ చరిత్రమై యుండవచ్చును.)
 
ఓ సహ్య పర్వతనివాసినీ ! శుభప్రదమైన చంద్రగిరియందు
వాసము జేయునది, వరము లిచ్చునది, ముసలితనము లేనిది
యగు భార్గవరామ జనని శుభము లొసగు గాక.
 
కృత్త శిరస్సు కలది, పవిత్రమైనట్టియు, విచిత్రమైనట్టియు కథ
కలది, సూర్యమండల మధ్యభాగము గృహముగా గలదియైన
యింద్రాణీ కళ తన పాదములను భజించు నన్ను రక్షించుగాక.
( దేవయాని మార్గమునుండి సూర్యుని బొందునది యింద్రాణీకళ.)
 
దేవతలచే పూజింపబడు పాదుకలు కలది, పాదములకు నమ
స్కరించువారికి మంచి బుద్దులిచ్చునది యైన అంబిక యగు
రేణుక పరాధీనమైన నా యీ భారతకులమును సతతము
శుచిగా నుండునట్లొనర్చుగాక.
 
ఓ యంబా ! ఉగ్రతమమైన పాపములను ధ్వంస మొనర్చుటకు,
నిగూఢ మైన ఆత్మబలమును ప్రకటన మొనర్చుటకు, స్వకుల ము
నుచ్చ దశ బొందించుటకు నేను నీ పాదములను సేవించు
చుంటిని.