2023-07-29 17:16:33 by ambuda-bot

This page has not been fully proofread.

13.
 
14.
 
15.
 
16.
 
17.
 
18.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
ఓ యంబా! కృత్తశిరస్కురాలైనను జమదగ్ని భార్యయైన
రేణుక తనయందు తత్ క్షణమే ప్రవేశించిన నీ యొక్క గొప్ప
తేజస్సుచే లోకశుభముకొఱకు తిరుగ జీవితమును బొందెను.
 
215
 
శిరస్సు లేని శరీరములో స్పష్టముగా ప్రాణములు ప్రకాశించిన
హృదయము బుద్ధితోగూడ బ్రకాశించినది. ఇంతకంటె విచిత్ర
మేది యుండును ?
 
ఓ రేణుకా ! శిరస్సుతో నున్న నీయందు శచీ సంబంధమైన
శిరస్సు లేని నీ యందామె
 
నొకానొక మోహన కళయు,
యొక్క భీకర కళయు నుండెను.
 
ఓ యంబా ! పరశురాముడు కా
 
ర్తవీర్యార్జున మహారాజును
జయించినప్పు డా విజయమునకు నీ తపస్సే కారణత్వము
 
బొందెను.
 
ఓ భగవతీ ! కృత్తశిరస్సుగల నీవు యుద్ధభూమియందు పరశు
రాముని భుజముల కమిత బలమునిచ్చి, దుర్మార్గులైన రాజులను
చంపించినదాన వైతివి.
 
శుభమైన కుండలీపురము వాసము గలది, పాదములకు నమ
స్కరించువారి పాపములను పరిహరించునది, కృత్తశిరస్కురాలు
ఆయిన ఇంద్రాణీకళ నాకు కుశలమిచ్చుగాక.
(కుండలీపురమే పడై వీడను క్షేత్రము. ఇది వేలూరు సమీప
మందున్నది.