2023-07-29 17:16:33 by ambuda-bot

This page has not been fully proofread.

7.
 
8.
 
9.
 
10.
 
11.
 
12.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
పరగృహమందు వసించెనను కళంకము నెంచి తన భార్య నీ జమ
దగ్ని ముని చంపుట కుగ్రమనస్కుడై, మనస్సునం దాలోచిం
చనివాడై, తన కుమారు నాజ్ఞాపించెను. ఆశ్చర్యము !
(తాను చంపక, కుమారుని చంపుమనుట యాశ్చర్యము.)
 
213
 
ఓ వరదా ! అతి భ క్తిమంతుడైనను (తల్లి యందు), తండ్రి
వచనమువలన రాక్షసునివలె తన కుమారునిచే చంపబడిన
యీ ముని పత్ని పుణ్యాత్మురాలనుచు నామెను
నామెను నీ యంశ
ప్రవేశిం చెను.
 
ఓ శచీ ! ఏ హేతువువలన నీవు నీ కళచే నీ మెయం దా వేశించి
తివో, ఆ హేతువువల్లనే మునిపత్ని పవిత్రురాలని చెప్పుట కిది
ఖండింపనలవిగాని యత్యంత ప్రజలకారణ మగుచున్నది.
 
దుర్మార్గులచే కల్పితమైన యీ దుష్టకథ వినుటవలన నా హృద
యము తొలుత దుఃఖభరితమై, పిదప నిర్మల బుద్ధిచే నిజమగు
చరిత్రను తెలిసికొని సంతోషమును బొందెను.
 
ఓ శచీ !
 
నా యీ సూక్ష్మశరీర మును కృపతో బ్రవేశించిన
నీయొక్క తేజస్సువలన పరశురామ జననియొక్క పవిత్ర కథ
తత్ క్షణమే స్మృతిపథమును బొందెను.
 
బహు గుణములుగల భార్య నా జమదగ్ని ముని యే హేతువు
వల్ల చంపించెనో, స్వచ్ఛమైన చరిత్రగల భార్యను దశరధ
పుత్రు డే హేతువుచే వనమందు విడచిపుచ్చెరో, ఆ హేతువు
 
వలన నుభయులు రాక్షసకృత్యమే చేసిరి.