2023-07-29 17:16:31 by ambuda-bot

This page has not been fully proofread.

స్త. 3.
 
9.
 
10.
 
11.
 
12.
 
13.
 
14.
 
ఇంద్రాణీ సప్తశతీ
 
యోగియొక్క శక్తివై నీవు దమముగాను (ఇంద్రియ నిగ్రహ
శక్తిగాను), స్త్రీయొక్క శక్తివే నీవు కాంతిగాను, జ్ఞానియొక్క
శక్తివై నీవు తృప్తిగాను, ధనుర్ధరుని శక్తిపై నీవు లక్ష్యశుద్ధిగాను
 
ప్రకాశించుచుంటివి.
 
205
 
ఓ దేవీ ! సంగదోషముగలవానియందు నీవు నిద్రాశక్తి నైతివి,
ధ్యానించువానియందు ముద్రాశక్తివైతివి. నీ వైభవమును
వర్ణించుట కెవడు సమర్థుడు?
 
ఓ దేవీ ! రాక్షసులను ఖండించునట్టిది, యవక్ర మైనదై విష్ణు
హస్తమందు బ్రకాశించునట్టిది యగు చక్రమేదికలదో, అది
'భద్రమైన, జాగరూకమైన నీయొక్క ఒకానొక కళాభారము నే
వహించుచున్నది.
 
FOR
 
ఓ దేవీ! దుష్టరాక్షససంహారమే శీలమై యొప్పు కైలాసాధిపతి
హస్తమందుండు శూల మేదిగలదో, దానియందు శత్రునాశన
పటుత్వముగల నీ తేజముయొక్క ఒక యంశమే ప్రకాశించు
చున్నది (విష్ణుచక్రమందును, శివశూలమందును నున్న అస్త్ర
శక్తి యామె వైభవమే అనుట)
 
తన జ్వాలలచే శత్రువులను హరించునది, యుదార మైనది
(అనగా సంహారమేగాక మంగళములకొఱకు రక్షించు నుదార
లక్షణముకూడ కలది)అయి యింద్రహ స్తమందే వజ్రమున్నదో
దానియందును దివ్యమగు నీ తేజోంశయే యున్నది.
 
ఓ తల్లీ ! మహిమచే వ్యాపించిన ఆకాశప్రదేశమందు గుప్తము
గాను, విలసించు సూర్యునియందు దీ ప్తముగాను, చల్లని కిరణ
ములుగల చంద్రునియందు శీతలముగాను, క్రతువులనుభరించు
వేదికాగ్ని యందు పవిత్రముగాను నీవు ప్రకాశించుచుంటివి.