2023-07-29 17:16:31 by ambuda-bot

This page has not been fully proofread.

స్త. 3.
 
3.
 
4.
 
5.
 
6.
 
7.
 
8.
 
ఇంద్రాణీ స ష్తశతీ
 
ఓ భగవతీ ! నీ శరీర కాంతి కోటి మెఱువుల ప్రభన లె ప్రకాశించు
చున్నది. పూర్ణ సమాధిగల నీ హృదయమందు శాంతికలదు.
నీ భుజబలము ఘోరమై శత్రుసంహారము చేయునది.
 
203
 
మిగుల మాధుర్యమున కాశ్రయమై లక్ష్మీనివాసమున కాల
యమువంటిదిగా ప్రసిద్ధి జెందిన పద్మ మింద్రదృష్టిలో నీముఖమే
యగుచున్నది. భక్తులదృష్టిలో నీ పాద మట్టి పద్మమగుచున్న ది.
 
ఓ దేవీ ! పాపమును తొలగించు నీ
పాదపద్మము
భుజించునో, వానికి నీ కటాక్షశతములు (ముఖపదానుగ్రహము)
లభించును. వానికి సమస్తము హస్తగత మగుచున్నది.
 
నెవడు
 
ప్రతి మానవ శిరస్సునందు జ్ఞాపకశక్తిగా నున్నది. ప్రతి నర
హస్తమందు కారకశక్తిగా నున్నది, యింద్రుని చక్షువునకు
సుకృతఫలసంపదయై యున్నది యగు ఇంద్రాణి నా యంత
రంగమున బ్రకాశించుగాక.
 
మంత్ర వేత్తల వాకున బ్రకాశించునది, ధ్యానపరుల మనస్సున
వికసించునది, భక్తిపరుల హృదయమందు విహరించునది, గగన
మందు సంచరించునది యైన పరా దేవియగు అంబ భాసించు
చున్నది.
 
సేవించువారి పాపములను నశింపజేయు నామముగలది, దిక్కల
చీకట్లను నశింపజేయు తేజస్సుగలది, రణభూమియందు భయ
మును గలిగించు నుజ్వలశస్త్రముకలది యైన ఇంద్రాణి నము
డనై యున్న నన్ను రక్షించుగాక.