2023-07-29 17:16:30 by ambuda-bot

This page has not been fully proofread.

. 2.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
11. ఓ యంబా ! నీకంటె నధికురాలైన పద్మముఖ లేదు; నాకపతి
కంటె నధికుడైన పురుషుడు లేడు; నందనవనముకంటెనధిక
మగు వనములేదు; శృంగారరసముకంటెనధికరసము లేదు.
 
12.
 
13.
 
15.
 
197
 
16.
 
సాటి లేని సౌందర్యముగల నీవు నాయికవు. "దేవ తా ప్రభువగు
ఇంద్రుడు నాయకుడు. నందనవసము రసమునకు రంగస్థలము.
ఇక్కడ మన్మధున కింక ఉత్సవము ఠా కేమి?
 
14. ఓ తల్లీ! యువరాజైన విష్ణువునకు సర్వవిష్టపభారము విడచి,
నందనవనమందు మీరు సల్పు క్రీడలు నా మైశ్వర్యమున కగు
గాక (గణపతి జన్మకని).
 
ఓ దేవీ ! మీ యుభయులకు మృత్యుకథ దూరమైయున్నది.
మీ యౌవన మెప్పటికి జారదు. కోరిన పరికరములు మీకు
లభించకపోవు. ఇంక రసమునకు లోపమేమున్నది?
 
ఓ దేవీ ! నందనవనమందు మీరు రహస్యాలోచనలు సల్పు
నప్పుడు నా యీ కృతి కొంచెము మిమ్ము స్పృశించినచో
నాకంటె ధన్యుడీ జగత్తునం దెవడుండును.
 
'ఓ దేవీ ! ఇప్పుడిక్కడ నమస్కరించుచున్న నాయొక్క మొఱ
నందనవనములో విహరించు మీకేమైన విఘ్న ము కలుగ జేసి
నచో, నీ పాదపద్మములుబట్టి నేను క్షమాపణ వేడెదను.