2023-07-29 17:16:30 by ambuda-bot

This page has not been fully proofread.

స్త. 2.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
5. ఓ దేవీ! నీ నగవు దిక్కులయొక్క యధికములగు చీకట్లను
మర్దించుచు, కొంచెముగా వెడలుచున్నను అధిక వైభవము
గలదై యున్నది. నీ కొప్పు శరత్కాల యమునాతరంగమువ లె
నీలవర్ణ ముతో గూడి అతిపావనమై యున్నది.
 
6.
 
7.
 
9.
 
195
 
10.
 
ఓ దేవీ ! నీ స్వరము వీణాస్వరమును పరుష మనిపించుచు,
MEE
దుఃఖంచువారి కానంద మొసగుచున్నది. మనోహర విలాసవశ
మగు నీ నడక మందముగానున్నది. నీ శరీరకాంతి వర్ణింప
నలవి గాకున్నది.
 
8. ఓ తల్లీ! దేవతాశరీరమును ధరించి, ప్రకాశించు పక్షములతో
(అనగా రెప్ప వెండ్రుకలతో గూడిన నేత్రములను బొందిన
నిన్ను జూచినప్పుడు దేవేంద్రునకు శృంగారమనెడి ఆదిమరసము
పుట్టెను.
 
ఓ దేవీ ! నీ బుద్ధి యతులమైన యోగసిద్ధులను బొందియున్నది.
నీ చాతుర్యము పండితులకు స్తుత్యమైయున్నది. దేవేంద్రునికి
త్రిలోకాధిపత్యముకం టె నీవేయెక్కువ సుఖము నిచ్చుచున్నావు.
 
అనాదియైన వాసనచే వసించు నాదిదంపతులు సంతోషనిధి
యగు శృంగారరసము నాదియందు బొందిరి. అందువల్లనే
ముల్లోకములందా క్రమము ప్రాకెను.
 
నీలోత్పలములవంటి నేత్రములుగల ఆ పురాతన స్త్రీ దేవతా
ప్రభువైన యింద్రునితో విహారమే కారణమువలన జేయుచుం
డెనో, ఆ కారణమువల్లనే సత్పురుషుల కాశృంగారరసమునం
దభిలాష గ ల్గెను.