We're performing server updates until 1 November. Learn more.

2023-07-29 17:16:29 by ambuda-bot

This page has not been fully proofread.

A
 
స 22.
 
25.
 
1.
 
2.
 
3.
 
सं
 
ఇంద్రాణీ సప్తశతీ
 
ప్రపంచమునకు రాణియై, యధిక ప్రభావముగల ప్రచండచండిని
కీర్తించు నా యీ ఉపజాతినృత్తములు దేవి నుపాసించువారికి
సంతోషము నిచ్చుగాక.
 
193
 
దిక్కులను శుభ్రపరచుటకు, లోకముల కైశ్వర్య మిచ్చుటకు,
ఇంద్రునకు ముద మిచ్చుటకు వెడలు ఇంద్రాణీ ముఖహాసము
 
VYL
 
మా పాపములను తొలగించుగాక.
 
అన్న లోపముచే కృశించి, భయభ్రాంతులై యున్న ప్రజలును;
భిన్న భావములచే దుర్భలులైన నాయకులును గల భారత
భూమిని పీడించు శత్రువులనుండి యింద్రాణి రక్షించుగాక.
 
ఓ తల్లీ! నీ పాణిపాదములు నూత్న పారిజాత పల్లవములను బోలి
ప్రకాశించుచున్నవి. నీ కుచద్వయము రాత్రియందు విరహము
లేనివియై, అంగ కాంతియనెడి నదియందు వసించు చక్రవాక
మిధునమువలె నున్నది.
 
ఓ దేవీ ! పూర్ణిమచంద్రుని కీర్తి నపహరించు నీ ముఖము ప్రస
న్న తాశోభ కాస్పద మైయున్నది. నీ దృష్టులు జ్ఞానశక్తి కాంతు
లకు నిధులు. నీ యధర మెరుపురంగుగల అమృతము ఘనీభ
వించినట్లున్నది.