2023-07-29 17:16:29 by ambuda-bot

This page has not been fully proofread.

స్త. 1.
 
23.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
అద్భుతశక్తియు క్తమై, వృషాకపికి దర్శనమైనట్టి 'సంహోత్ర'
మనెడి నీ యొక్క వేదమంత్రము నెవడు భజించునో, ఓ దేవీ!
వాని కీ జగత్తునం దసాధ్యమైన దేదియు నుండదు.
 
నారీ సమనం వావ
 
ఆ మంత్రిమిది :- "సంహోత్రం స్మపురా
గచ్ఛతి, వేధా ఋసత్య వీరిణీంద్ర పత్నీ మహీయతే, విశ్వ
స్మాదింద్ర ఉ త్తరః"
 
189
 
(వృషాకపికి నామాంతరమగు గణపతికి (అనగా నీ కవికి) ఒక వేదమంత్రము
దర్శనమయ్మెను. అది యింద్రాణీ యనబడు చండీ మంత్రమై, అగ్నిహోత్రమునందర్పిత
మగు సంహోత్రసంబంధము గలది గావున నీ శ్లోకమందు శ్లేషచే కవి దానిని ధ్వనింపజేసి
నట్లును భావించవచ్చును. వైదిక మంత్రములందు తాంత్రికమంత్రములందువలె బీజాక్షరము
లుండవు. ఎందువల్లననగా, తాంత్రిక మంత్రములు శబ్ద ప్రధానములుకాగా, వైదిక మంత్రము
లర్థ (తేజ) ప్రధానములు. అప్లైనను, తాంత్రిక మంత్రములలో శ్రేష్ఠమైన వాటికి తత్త్వార్థము
లుండకపోవు. దర్శనమైన వేదమంత్ర మింద్రాణీ మహావిద్యయనియు, విరాణ్మహా మంత్ర
మనియు, వజ్రాస్త్రవిద్యయనియు, రేణుకా విద్యయనియు బహువిధములుగా వేదమందు
స్తుతింపబడి, యిహపరముల రెండింటియందును సకలార్ధ సిద్ధిదాయకమగుచున్నది.
గాక, మంత్రార్థముచే సహస్రారసిద్ధికి మించిన హృదయసిద్ధినిచ్చునది యగుచున్న డి
 
అంతే
 
ఆ మంత్రమిది:-)
 
"రాయసామో వజ్రహ స్తం సుదక్షిణం పుత్రోన పితరం హు వే."
(స్త్రీలు జపించునప్పుడు 'పుత్రీణ' అని 'పుత్రోన' కు బదులుగా
మార్చవలెను. ఈ మంత్రమునకు 'స్వాహా' అనిచేర్చి, దీని చే
సగ్నియందు హోమములు చేయబడును.)
 
అర్థము :-
:- రాయస్ = సకలార్థ కామమోక్షములను, కామో=కోరు
చున్నవాడనై, వజ్రహస్తం = వజ్రాయుధమును హస్తమందు
ధరించువాడును (ఇంద్రుడు) - లేదా ఆధ్యాత్మికార్థముచే వజ్ర
దండ మనబడు సుషుమ్నా శక్తియుతమగు వెన్నె ముకను హ స్త
ముచే హృదయస్థానమునుండి ధరించువాడును, సుదక్షిణం=
దానముచేయుటకు సుప్రసిద్ధమైన దక్షిణహ స్తము కలవాడును