2023-07-29 17:16:27 by ambuda-bot

This page has not been fully proofread.

. 1.
 
5.
 
6.
 
7.
 
8.
 
9.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
సమ స్త లోక ములకు నాయకురాలైన ఆకాశశరీరిణి యగు తల్లి
SCIEN
యొక్క మహనీయమైన మహోంశయొక్క సారమును పండి
తులు తటి తనుచున్నారు.
 
( తేజోంశ సారమును. ఇది వస్తువుతో కూడి సహస్సై తిరుగ
వస్తువునుండి సారమువలె వస్త్వనుభవరూపిణియై మహస్సుగా
నివృత్తియగును.)
 
179
 
నిగూఢ తేజోంశశరీరముగా గల యీ అంబిక సర్వత్ర ప్రకా
 
శించు ప్రచండ చండిక యగుచున్నది. అవ్యక్త శబ్దాంశ శరీర
ముగా గల దేవియొక్క వికల్పములను (విభూతులను) కవులు
భిన్న ( దేవీ) నానుములతో పిల చిరి.
 
శబ్దము లేనిదే తేజస్సు లేదు, తేజస్సు లేనిదే శబ్దముండదు.
ఈ రెండును నిత్యము కలసి నీ శక్తిద్వయమగునప్పుడు, వానిచే
నీ స్వరూపమున కెట్లు వ్యత్యాసము కలుగును.
 
(శబ్ద తేజములు రెండు శక్తియొక్క క్రియా చిచ్ఛాఖలు. ఈ
రెండింటికి మూలశక్తి యొక్కటియే గావున మూలస్వరూపము
నెఱుగుటకు రెండు మార్గములు విధింపబడెను.)
 
ప్రకృష్టమై యొకేశక్తి జ్వలించుచు, శబ్దించుచు నంతటను
బ్రకాశించునప్పుడు పండితులచే చెప్పబడు శక్తిద్వయము
క్రియా భేదమం దే సమర్థనీయమగును.
 
(అనగా శబ్దించుట, జ్వలించుట అను క్రియలవలననే శబ్ద తేజ
ములను వేఱు చేయగలమని భావము.)
 
ఒకే క్రియకు ఫల భేదమువలన తిరుగ విభాగము పండితులచే
PLA
చేయబడెను, శ్రేష్ఠస్వరమును (ఫలభేదమువలన) 'కాళి'గాను,
'తార'గాను చెప్పుచున్నారు; తేజస్సును (ఫల భేదమువలన)
చండికగాను, లలితగాను చెప్పుచున్నారు.