2023-07-29 17:16:27 by ambuda-bot

This page has not been fully proofread.

స్త. 1.
 
1.
 
2.
 
3.
 
4.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
177
 
మందమైనను నీ హాసము మునులకు జ్ఞానమిచ్చును, స్వచ్ఛ
మైనను ఇంద్రునకు రాగమిచ్చును, అల్పమైనను దిక్కుల చీక
ట్లను బోగొట్టును. అట్టి యింద్రాణీమందహాసము ప్రకాశించు
 
గాక.
 
సకల పాపనివారణఱకు, భాగ్యమును వృద్ధిగావించుటకు
శోకభూయిష్ఠమైన భారతభూమి నింద్రాణి తన మనస్సునం
 
దుంచుకొనుగాక.
 
ధర్మమునకు శత్రువులై యింద్రుని నిరాదరించువారిని సంహ
రించుట కతి జాగరూకురాలు, దేవయానమార్గమందు బ్రజ్వ
లించు శక్తియగు ప్రచండచండిని మేము స్మరించుచుంటిమి.
 
వ్యాపించునది యనిగాని,
 
గమనమందు
 
నిగూఢ మైయుండు
తటి తనిగాని, ఇంద్రసతి యనిగాని సుషుమ్న యందు సంచరించు
నది యనిగాని 'ప్రచండ చండీ' పదమున కరము.
 
(యోగశాస్త్రమందు సుషుమ్నయనునది వ్యష్టిశరీరములందు వెన్నెముకద్వారా
మూలాధారమునుండి సహస్రారమువరకు ప్రవహించు శక్తి నాడియని పేర్కొనబడెను. నాడి
యనగా శక్తి రశ్మియని భావము. ఇది సూర్యునినుండి ప్రతిశరీరమును బొందు రశ్మి. సూర్య
రశ్మి యొక్కొక్కటియు శాఖలగుచు నెన్ని శరీరములున్నవో అన్ని శాఖలుగా విభాగమైనను,
ప్రతిశాఖయు సమష్టియందు సుషుమ్నయగుచున్నది. ఆకాశమునుండి సూర్యుని బొందిన
ప్రచండచండీ యను తేజళ్ళక్తి సూర్యగోళమునుండి యీ విధముగా రశ్మిరూపములచే
విభాగమగుచున్నను, ప్రతిరశ్మియందు సంచరించుచున్నందున నీమే సుషుమ్నామార్గసంచారిణి
యగుచున్నది.)