2023-07-29 17:16:26 by ambuda-bot

This page has not been fully proofread.

ఇంద్రాణీ సప్తశతీ
 
22. పశ్చిమదిక్కున బ్రవహించుచు (వెన్నెముకయందున్న సమున్న
యందు) గొప్ప మదమును గలిగించుచుంటివి. నీవు తూర్పు
దిశ (ముందు వైపున్న హృదయమందు - సూర్యుడు ప్రకాశించు
వైపు) బ్రవహించి బుద్ధికి శాశ్వతసిద్ధి నిమ్ము.
(పాశ్చాత్య దేశములు, ప్రాదేశములు శ్లేష చే నుద్దేశింపబడెను)
 
23.
 
24.
 
173
 
ఓ తల్లీ ! నిర్మలమైన సుషున్ను నధిష్ఠించి మదముకొఱకు ప్రవ
హించుచుంటివి. అమృ తానాడి నధిష్ఠించి (శిరస్సునుండి ముందు
వైపునకు హృదయమువరకు నుండు సూక్ష్మనాడి) కొంచెము
బుద్ధిబలముకొరకు ప్రవహింపుమా.
 
ఓ దేవీ ! భారతభూమిని రక్షించుటకై నా మనస్సునం దుపా
యములు చెప్పి, భక్తుడనైన నన్ను శక్తిమంతునిగా జేసి, కృత
కృత్యుని గావింపుము.
 
22. నరసింహపుత్రుడైన కవి శ్రేష్ఠునిచే రచింపబడిన కమనీయ
'మేఘవితాన' వృత్తము లింద్రాణికి దృప్తినిచ్చుగాక.