2023-07-29 17:16:26 by ambuda-bot

This page has not been fully proofread.

5.
 
6.
 
7.
 
8.
 
9.
 
10.
 
ఇంద్రాణీ సప్తశతీ
 
ఓ శచీ! నీ తటిత్స్ఫరణ దృష్టిని హరించుచు, నీ గర్జన ధైర్య
ముతో గంభీర మైయున్నది. మెరుపురూపమున నున్న నీ భయం
కరత్వము రామణీయముతో మిళితమైయున్నది.
 
167
 
.
 
ఓ దేవీ ! · మేఘాధిపతియైన యింద్రుని మదింప జేయు దాన వై,
జనులకు దుఃఖమును గలిగించిన 'అవగ్రహ' మను పేరుగల
రక్కసుని ఖండించి నీవు ప్రకాశించుచుంటివి.
 
మేఘాధిపతియగు నింద్రుని రమింప జేయుదానవు, నమస్కరించు
వారి పాపములను హరించుదానవు, దిక్కు-ల తిమిరములను
హరించుదానవు అయి నీ వాకాశమందు విలసిల్లుచుంటివి.
 
అధిక గర్జనయు, ఉగ్రబలమును ధరించు తటిత్తు నా హృద
యము నాక్రమించిన మాయ యనెడి తమః పటలమును శీఘ్ర
 
ముగా నశింపజేయుగాక,
 
ఓ తల్లీ ! సమస్తాకాశమందు బ్రవహించు తటిద్రూప తరంగము
లలో నొకటియైన మెఱపీ మేఘమందు బ్రకాశించుచున్నది.
(అవ్యక్తముగా నంతటను అలలుగా వ్యాపించియున్న విద్యు
చ్ఛ క్తియొక్క ఒక యల యే మనకుఘోరమైన మెఱుపగుచున్నది)
 
ఓ తల్లీ ! ధనికుల గృహములందు పటుయంత్ర బలమువలన
బుట్టిన కిరణములుగల దీపములు (విద్యుద్దీపములు) నీ యొక్క
లేశ కాంతి యగుచున్నవి.