2023-07-29 17:16:25 by ambuda-bot

This page has not been fully proofread.

25.
 
1.
 
2.
 
ఇంద్రాణీ సప్తశతీ
 
గణపతియొక్క రమణీయమైన యీ 'మణిరాగ' వృత్తము
లింద్రాణీ పాదములందర్పింపబడినవై ప్రకాశించుగాక.
 
165
 
ఇంద్రుని మనస్సును మదింపజేయునది, శుభ్రతకు స్థానమైనది
యగు ఆదిస్త్రీయొక్క ముఖమునుండి వెడలు మందహాసము
 
నా యఖిల కలుషములను హరించుగాక.
 
బొత్తిగా ధనములేనిదై, యతిఖన్నురాలై, యిప్పుడు బహుళ
నోదనము గావించుచున్న భరతక్షితిని త్రిలోక పాలకురాలైన
A
యింద్రాణి రక్షించుగాక.
 
3.
 
ఓ తల్లీ ! మెరుపనెడి యుజ్జ్వల వేషముతో నీ వెచ్చట ప్రకా
శింతువో, అట్టి మేఘసమూహము నీకు స్థలమైయున్న ది.
(ఈ స్తబకములోనివి మేఘవితానవృత్తములగుట చమతారము)
 
భూలోకమందు లలితమై, యువక చి త్తములను హరించు వనిత
లను బోలి మేఘమందు విలసించు తటిద్రూపముతోనున్న
నీ భౌతిక దేహము జయప్రదముగా ప్రకాశించుచున్నది.