2023-07-29 17:16:25 by ambuda-bot

This page has not been fully proofread.

. 3.
 
19.
 
20.
 
21.
 
22.
 
23.
 
24.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
ఓ తల్లీ ! నీ లోచనములు కాంతికి, సర్వతోగతికి నిధులు.
కవుల ధోరణి ననుసరించి వానిని పద్మములతో బోల్చుటకు
నేను లజ్జించుచుంటిని.
 
163
 
విశాలములై ప్రకాశించు నేత్రములు, సంపెంగ పువ్వుతో సరి
నాసిక, రత్న ఖచితమైన అద్దములవంటి చెక్కిళ్లు,
శ్రీకారమును బోలు సుందర కర్ణములు,
 
అష్టమీ చంద్రుని బోలు ఫాలము, ముల్లోకములను చలింప
జేయు విలాసము, నవ్వుచే సుందరముగుచున్న ముఖముగల
యింద్రాణి నాకు మంగళము లొనర్చుగాక.
 
చిఱునవ్వునందు తెలుపు రంగు, తల వెంట్రుకలయందు నలుపు
రంగు, అధరోష్ఠమం దెరుపురంగు యీ మూడు గుణములు
గల ప్రకృతి మమ్ము రక్షించుగాక. (సత్త్వరజస్తమస్సులు)
 
సకలలోక నారీమణులలో శుభప్రదమైనది అని యేదేవిని
వేదము చెప్పుచున్నదో, జగదాకాశములు రెండింటియం దే దేవి
కాంతిసారమో, అట్టి యింద్రాణికి నేను నమస్కరింతును.
 
శరీరమును ధరించిన యింద్రుని లోచన భాగ్యలక్ష్మియగు
పద్మనేత్రములుగల దేవి భాతరక్షణకై నరసింహ పుత్రునకు
సామర్ధ్యము నిచ్చుగాక.
 
('సర్వభూపతి'కి బదులు 'స్వర్గ భూపతి' యని పాఠాంతరము)