2023-07-29 17:16:24 by ambuda-bot

This page has not been fully proofread.

. .
 
14.
 
15.
 
16.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
ఓ తల్లీ ! నీ హస్తముల మార్దవమును గుఱించి కాంతిని గూర్చి
యింద్రుడే పల్కుగాక. మును లా హ స్తదాతృత్వ పటుత్వము
లను మాత్రము నర్ణింపగల్గిరి.
 
18.
 
161
 
ఓ తల్లీ ! పుష్పమాలికలవంటి నీ మృదు బాహువులశక్తి రాక్షస
సంహారమందుగ్రమై గన్పట్టెను. నీ శరీరతత్త్వ మెవడు చెప్ప
 
గలడు ?
 
ఓ దేవీ ! ముత్యాలహారముతో బ్రకాశించుచు, దేవేంద్రుని
లోచనముల కింపై యున్న నీ కంఠము నాకుబహు భద్రము.
లను బల్కుగాక.
 
17. ఓ దేవీ! కాంతులకు నిధియైన నీ ముఖము యొక్క అద్భుత
రామణీయకమునకు దేవతలచే నుతింపబడు సర్వసిద్ధులు గల
యింద్రుని వశ మొనర్చుకొను (వశీకరణ) సిద్ధి కలదు.
 
ఓ దేవీ ! రవిబింబములో నెక్కువ ప్రసన్నతలేదు. చంద్ర
బింబములో నెక్కువ యుజ్జ్వలత్వము లేదు. 'సుప్రసన్న ముగల
మహోజ్జ్వలమైన నీ ముఖమును దేనితో మేము సరిపోల్చుట ?
(సూర్యునిలో నుజ్జ్వలత్వమే కలదు, చంద్రునిలోఁ బ్రసన్నతయే
కలదు. రెండు గుణములు నీ ముఖమునఁ గలవు కనుక నిరుప
మానము.}