2023-07-29 17:16:25 by ambuda-bot

This page has not been fully proofread.

8.
 
9.
 
10.
 
11.
 
12.
 
13.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
ఓ దేవీ! నీ కటి పృథ్వీమండలమువలె నున్నది, నడు మాకా
శమువలె నున్నది, నాభి పాతాళమువలె నున్నది..
 
159
 
ఓ తల్లీ ! ఏ నీ రోమరాజి దేవేంద్రుని ధైర్యమును గూడ
హరించుచున్నదో, మన్మధుని శస్త్రమైన ఆ రోమరాజి నా పాప
 
ములను హరించుగాక.
 
ఓ దేవీ ! నీ రోమరాజి యనెడి పాముపిల్ల యింద్రహృదయ
మును కరచి, యతనితో చిరాయుర్జీవితముకొఱకు వాని హృద
యమునకు మోహమును గలిగించుచున్నది. విచిత్రము !
 
ఓ జననీ ! జలపూర్ణములైన స్వర్ణ ఘటములవలెనుండి దేవేం
ద్రునిచే నుంచబడిన శక్తిని ధరించు నీ కుచములు విశ్వపోషణ
కర్మయందు సమర్ధములై ప్రకాశించుచున్నవి.
 
ఓ తల్లీ ! స్వర్ణ కుంభములనెడి స్తనములందు నీ శక్తిపూర్ణమై
యింద్రునితో గూడి లోక పానమందు (అతనికొఱకు) వీర్యమును
భరించుచున్నవి.
 
(అనగా నామె కుచము లింద్రునకు పాలకశక్తినిచ్చుచు నితరు
లకు పోషణశక్తి నిచ్చుచున్న వని)
 
ఓ దేవీ ! అక్షయమగు నమృతపూర్ణ ఘటముల నెడి కుచములను
పానముజేసి జయంతుడు లోకములను బాధించిన భీకరరాక్షసు
లను సంహరించుటకు సమర్థుడయ్యెను.