2023-07-29 17:16:24 by ambuda-bot

This page has not been fully proofread.

. 3.
 
2.
 
A
 
3.
 
6.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
దుష్టసమూహమున కందరానిది, శిష్టులశోక మును నివారించు
సామర్ధ్యముగలది, స్వర్గమునకు రాణియునగు ఇంద్రాణి భారత
దేశ కష్టములను దొలగించుగాక.
 
7.
 
157
 
దేవతల కిరీటములందుండు మణుల కాంతులకు స్వయముగా
మఱింత కాంతినొసగు ఇంద్రాణి పాదపద్మశోభ సదా నాకు
క్షేమమిచ్చుగాక.
 
5. ఓ తల్లీ ! దేవతలచే నమస్కరింపబడును గనుక ప్రకాశవంత
మైనవి, యింద్రుని నేత్రముల నాకర్షించును గనుక సుందర
మైనవి, నమ్రుల పాపములను ఖండించును గనుక పావనమైనవి
యగు నీ పాదములను నేను సేవించుచుంటిని.
 
ఓ దేవీ! నీ ముఖము బహు కాంతిమంతము. అందుల కింద్రుని
మనస్సే సాక్షి. ఓ తల్లీ ! నీ చరణము లతి కాంతిమంతములు.
వానిని స్మరించు మా మనస్సే యందులకు సాక్షి.
 
ఓ తల్లీ! కాంతుల సమూహమంతయు నే పిక్కలయందు ఘనీభ
వించెనో, ఇంద్రుని వేయి కన్నులు నే పిక్కలను జూచుటకు
లోభించుచున్నవో, అట్టి నీ పిక్కలు ప్రకాశించుచున్నవి.
 
ఓ తల్లీ ! వినయసమయమందే నీ తొడలను వాణీ దేవి కూడ
వందిజనమువలె నమస్కరించుచుండెనో,
అట్టి నీ తొడలు
సౌందర్య సారమునకు నిలయములు.