2023-07-29 17:16:23 by ambuda-bot

This page has not been fully proofread.

. 1.
 
12.
 
13.
 
14.
 
15.
 
16.
 
17.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
ఓ దేవీ ! ముసలితనము, నాశనములేక సనాతనమై, ముని
జనులచే తెలియబడు వైభవముగల తపోలోకము నీ కంటె
 
వేఱుగా నుండదు.
 
151
 
ఓ తల్లీ! సకలదృశ్య (ప్రపంచ) మునకు మూలకారణమగునది,
నీ కాధారమగునది, యితరము నాశ్రయించనిది యగు పరమ
పురుషవస్తువే సత్యలోక సంజ్ఞచే తెలియబడుచుండెను.
 
ఓ దేవీ! పురాతన ఋషుల భాషయం దీ గగన ముదకమని
(కం=ఆకాశము, ఉదకము) చెప్పబడుచున్నది. పిమ్మట భగ
వంతుని వీర్య మా యు దకము లో ప్రవేశ పెట్టబడెననియు,
ఆవీర్యము భరించినది నీవేయనియు పల్కుదురు.
 
ఓ శచీ ! ఈ నీ పేరును (వీర్యయుక్తజనోలోకము లేదా జన
యితృత్వాకాశమును) 'విరాట్' యనియు శ్రుతి చెప్పుచున్నది.
విస్తార మైన విశ్వము స్వరూపముగాగల శరీరమునకు (గర్భమందు
విశ్వముగల నీ శరీరమునకు) 'విరాట్' పదము ప్రసిద్ధము.
 
ఉపనిషద్భాషలో చెప్పబడిన 'విరాట్' వధూస్వరూపము నితర
భాషలలో (శ్రుతిభాష గాక పౌరాణిక కావ్యాది భాషలలో)
పురుషుడని చెప్పబడెను (విరాట్పురుషుడని). స్త్రీ పుంలింగము
లలో రెండు విధముల 'విరాట్' పదము సాధువగుటచే సంశ
యాస్పదముగా నున్నది.
 
(ఎట్లనగా) లోకములో శరీరమున కాంతర్యముననున్న వీర్య
వస్తువు స్త్రీయుగాదు, పురుషుడు కాదు. స్థూలశరీరమునకు గల
లింగ భేద దర్శనమువలన శరీరమతముననుసరించి అంతరాత్మకు
లింగము చెప్పబడెను. (విరాట్టునకు)