2023-07-29 17:16:21 by ambuda-bot

This page has not been fully proofread.

స్త. 2.
 
4.
 
5.
 
6.
 
7.
 
8.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
గృహములగుట చమత్కారము. ఆమె శరీరము భువనముల
కంటె సూక్ష్మము గనుక వాని యంతరమున నాకాశము నివ
సించి యుండును. ఆ విధముగా నామె కవి గృహము లగు
చున్నవి.)
 
147
 
ఓ దేవీ! బుద్దికి దూరమై ప్రకాశించు ఆకాశమును (ఆకాశము
నాల్గు విధములని శ. 1, స్త. 3, శ్లో. 19 లో చెప్పబడెను.
వానిలో ఆమెకు శరీరమగు పరమాకాశము నిచ్చట గ్రహించ
వలెను) పండితులొక లోకముగా చెప్పుచున్నారు.
 
ఓ దేవీ! ఆ యా కాశమ నెడి నీ శరీరమున సూర్యులు, చంద్రులు
భూమితో సహ వేలకొలది గ్రహములు, మఱియు ననేక జగ
త్తులు నివసించుచున్నవి.
 
ఓ తల్లీ! అనేక సూర్యులచే దహించబడు నుణ్ణశ క్తికంటె,
ననేక చంద్రుల వశీకరణశక్తికంటే నాకాశమందున్న నీబలము
నూరు రెట్లధికము.
 
ఓ దేవీ! ఒక్క సూర్యుని వైభవము చెప్పుటకే పురుషు డస
మర్ధుడైనప్పుడు, నూర్లకొలది యట్టి సూర్యులు సీ యుదరమం
దున్న నీ వైభవము నెట్లు పురుషునకు చెప్పశక్యమగును.
 
ఈ యాకాశమును శరీరముగా గొని యెల్లరకు సమీపముగా
నున్న పరాదేవి చపలబుద్ధిగలవారిచే చూడబడ లేదుగదా.