2023-07-29 17:16:19 by ambuda-bot

This page has not been fully proofread.

6x
 
ఇంద్రాణీ సప్తశతీ
 
16. ఓ తల్లీ ! హృదయమునుండి పుట్టిన ఆ చిత్తము శిరస్సునందు
ప్రత్యేకముకా (వేటొక కర్తగా) వాసముచేసి, హృదయమం
దుండు 'అహం'స్ఫురణను స్వయముగా నాక్రమించి (శిరస్సు
నుండి హృదయమునకు ప్రతిఫలించుటద్వారా), మమ్ములను
భ్రాంతియందు ముంచుచున్నది.
 
(చిత్తము మనస్సగుట, చిత్తాకాశము భూ తాకాశమగుటయి ప్లే)
 
17.
 
19.
 
131
 
ఓ తల్లీ! ఆ చిత్తము మా తేజస్సును బొంది మా కే యధిక
బాధలు కలిగించుచున్నది. మనస్సుచే నిట్టి యన్యాయము
బడెను. ఓ దేవీ! రాణివైన నీవు వినువు.
 
(ఆత్మయం దహమ్మహమ్మను భాసమానము సహజమైయున్నది.
ఈ భాసమానమును బొంది చిత్తము ప్రకాశించినప్పు డహం
చైతన్య మూలముగుఱించి సందేహము రావచ్చును, మాస
వచ్చును. చిత్తమే మూలమనిపించుట అహంకారము.)
 
సూర్యుని తేజస్సు చంద్రున కెట్లో, హృదయ తేజస్సు మనస్సున
కట్లు. ఎవ డిట్లు తెలిసి నిత్యము తలచునో, వాని చి త్తము
హృదయమందు లీనమగును.
 
ఓ దేవీ! ఆ చిత్తము హృదయమందు లీనమై, మూలా న్వేషి
యగుచు, మాటిమాటికి స్ఫురించుచు, గ్రంధులను కబళించి,
క్రిందకు వచ్చును. అట్టి యోగుల హృదయమందు నీ వొక్క
తెవే ప్రకాశింతువు.
 
20. ఓ తల్లీ! శిరస్సునందు చంద్రుడు, హృదయమందు భానుడు,
నేత్రమందు విద్యుత్తు, కుండలినియం దగ్ని - ఇట్లు నీ తేజస్సు
యొక్క అంశలతో గూడి యున్నవి.