2023-07-29 17:16:18 by ambuda-bot

This page has not been fully proofread.

స్త. 4.
 
ఇంద్రాణీ స పశతీ
 
11. ఓ తల్లీ! ఎవడు తన వినే చెవిలోని యంతశ్శబ్దమును గ్రహిం
చునో, నీవా సాధకునిలో మేల్కాంచి యా కాశముతో నైక్య
భావము నిత్తువు. (శబ్దమూలము నెఱుగుట యిదే.)
 
12.
 
13.
 
15.
 
129
 
పవిత్రుడైన యెవడు ప్రాణముయొక్క దూతాయాతముల
జూచునో. వానియందు మేల్కాంచిన యింద్రాణివై విశ్వము
నకు ప్రియమైన క్రీడ సల్పుదువు,
 
ఓ యంబా ! ఎవని చిత్తము కార్యములందు సమర్థమైనదో,
వానియందు నీవు నిద్రించియుందువు. ఎవని యాత్మకార్యము
లందు సమర్థమైనదో వానియందు నీవు మేల్చాం చియుందువు.
(చిత్తమే క ర్తయని యహంకరించువాడొకడు, కర్త స్థానమాత్మ
యని తెలిసినవాడింకొకడు.)
 
2
 
14. ఎవని యహంకారము మనస్సునం దుండునో, వాని మనస్సు
చేయుటకు సామర్ధ్యము బొందును (కాని వానియందు నీవు
నిద్రింతువు. అనగా ఆత్మ కప్పబడును). ఎవని యహమాత్మ
యందుండునో,
వాని యాత్మ
చేయుటకు సామర్ధ్యము
 
బొందును. (అనగా దేవియే వానియందు చేయుచుండును.)
 
ఓ దేవీ ! ఎవని మనస్సు చేయు సామర్ధ్యము బొందునో, వాని
యం దా కర్మ యల్పమగును. ఎవని యాత్మ క్రియా సామర్ధ్య
మొందునో, వాని కర్మ శ్లాఘ్యము.
(అనగా వాని కర్మ కీర్తిమంతమగును.)