2023-07-29 17:16:17 by ambuda-bot

This page has not been fully proofread.

1.
 
2.
 
3.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
125
 
సూక్ష్మమైనను తెల్లని కాంతిచే దిక్కులందు వ్యాపించునది,
తిమిరమునకు శత్రువైనది యగు ఇంద్రాణీహాసము నా యజ్ఞా
నమును బూర్తిగా హరించుగాక.
 
చెవులతో వినుచున్నదై (యీస్తుతిని) దయగల యింద్రాణి
నిత్యశోకము చే విశేషముగా రోదన మొనర్చు వాణి గల్గిన
 
భారతభూమిని రక్షించుగాక.
 
స్వర్గములో దేవతలందు బ్రకాశించుచు, చంద్రగోళములో
భూతములయందు క్రీడించు ఇంద్రాణి యీ భూమిలో మానవు
లందు నిద్రించుచున్నది. ఆశ్చర్యము !
 
(మూలాధారమం దజ్ఞానులలో నిద్రించుచుండునని చెప్పబడును)
 
దేవీ ! నిద్రించుచున్నను, నీ తేజోగంధమువలన ఈ మనుజులు
భూలోకమందు కొంతవఱకు సమర్ధులగుచునే యుండిరి. నీవు
మనుజునియందు మేల్కాంచి తెలియబడిన చో నింక చెప్పుట
మున్నది ?
 
5. ఓ తల్లీ! సూర్యుడు మేఘములచే గప్పబడినను వెల్తురు నిచ్చు
చుండెను. నీవు గ్రంధులచే గప్పబడియు నీ లోక ములోని వారికి
(భూలోకస్థులకు) ప్రజ్ఞ నిచ్చుచుంటివి.