2023-07-29 17:16:18 by ambuda-bot

This page has not been fully proofread.

. 3.
 
19.
 
20.
 
21.
 
22.
 
23.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
ఓ తల్లీ । ఒకడు యోగబలము చే దన శరీరమందు శక్తిని వృద్ధి
పొందించుకొనును. ఇంకొకని శరీరమున నీవే వృద్ధినొందుదువు.
 
25.
 
123
 
సాధించు 'యోగ వే త్తలకు, కీర్తనసల్చు భక్తులకుగూడ వాత్సల్య
ముతో
గర్భమందుబుట్టిన వారికి వశమైన ట్లింద్రాణి వశమగును.
 
ఓ దేవీ ! ఎవడు సమాధిజెందురో, వానికి తన
బలము. ఎవడు నీ పాదములు నాశ్రయించునో వానికి నీవే
 
బుద్ధియే
 
బలముగాదా.
 
ఓ తల్లీ ! ద్వాదశవర్ష ములు యోగబలయుక్తు డైనవాని కేశక్తి
కలిగెనో (శ్రీ రమణమహర్షి యుదేశింపబడెను), నీ యందు
భక్తునకుగూడ (కవికి) నట్టిశక్తి నిచ్చుటకు నీకు ఒక్క గడియ
 
చాలును.
 
యోగబలము చే ధ్యానించు వానికి, భక్తిబలముచే కీర్తించువానికి
నేశక్తి వృద్ధిబొందునో, అట్టి యింద్రాణీ సంబంధశక్తి నా శరీ
 
రము బొందుగాక.
 
24. దుఃఖించునట్టి, ఐశ్వర్యము గోల్పోయినట్టి, సర్వహిత మైనట్టి
యీ భరతఖండమును రక్షించుట కింద్రాణి నాకు సమర్ధ బుద్ధి
నిచ్చుగాక.
 
కవిభర్తయైన గణపతియొక్క సుందరమైన, పరిశుద్ధమైన యీ
సన్మణిమధ్యావృత్తము లింద్రాణికి కర్ణ సుఖము నిచ్చుగాక.