We're performing server updates until 1 November. Learn more.

2023-07-29 17:16:16 by ambuda-bot

This page has not been fully proofread.

స్త్రీ, 3.
 
11.
 
12.
 
13.
 
14.
 
15.
 
16.
 
17.
 
18.
 
121
 
ఇంద్రాణీ సప్తశతీ
 
శోకమును బోగొట్టునది, తమస్సును దొలగించునది, చిత్తమును
సంస్కరించునది, పరిశుద్ధ వ్యోమశరీరము బొందినది యగు
ఇంద్రాణియొక్క వీచిక యొక్కటి నన్ను బ్రవేశించుగాక.
 
కిరణములు వెడలుచున్న యీ మూలాధారము, కపాలభిన్న
మైన యీ శిరస్సు, మోహవర్ణితమైన యీ చిత్తముగల నన్ను
వాసవశక్తి యా వేశించుగాక.
 
ప్రపంచమునుండి విర క్తమైన యీ కన్ను, భోగమునుండి విర క్త
మైన యీ దేహము, ధ్యేయవస్తువునుండి విరక్తమైన యీ
బుద్ధిగల సన్నింద్రాణి ప్రవేశించుగాక.
 
కంటి కదృశ్యమైన జ్వాలలను భరించుచు, మిక్కిలి ప్రకా
శించుచు విస్తరించిన ఆకాశముచే విస్తృతమైన శరరమును
ధరించిన యింద్రాణి నన్ను ప్రవేశించుగాక.
 
పూర్ణ బుధ్ధిని వ్యాపింపజేయుచు నెల్లప్పుడు శరీరమును వజ్రదృఢ
ముగా నొనర్చు ఇంద్రాణి నన్ను ప్రవేశించుగాక.
 
ఆకాశమునుండి శిరస్సు పైబడుచు, సర్వశరీరమునందును సంతత
దివ్య ప్రవాహముగానున్న యింద్రాణి నన్ను ప్రవేశించుగాక.
సూర్యునియందుగల ప్రకాశకత్వము, అమృతమందుగల మోద
కత్వము, సురయందుగల మాదకత్వము-యీ మూడు వాసవ
శక్తియందున్నవి. ఆమె నాలోఁ బ్రవేశించుగాక.
H
 
ఇంద్రాణీశక్తి నాయొక్క మానసిక సత్యమును లెస్సగా బ్రకా
శింపజేయుగాక, నా కుదారసంతోషము నిచ్చుగాక, సాత్విక
బల మిచ్చుగాక.