We're performing server updates until 1 November. Learn more.

2023-07-29 17:16:15 by ambuda-bot

This page has not been fully proofread.

. .
 
6.
 
7.
 
8.
 
9.
 
10.
 
11.
 
12.
 
13.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
ఓ తల్లీ ! వనవిహారమందు నీవు మధుర వాగ్విలాసములచే కను,
మిగుల గుణములుగల ము ఖ వి లా స ము చేత ను ఇంద్రుని
మనస్సాకర్షించితివి.
 
113
 
బంగారుపద్మమువలె సొగసైన ముఖము. నల్లకలువ రేకులవంటి
నేత్రములుగలది దేవి. తెల్లని కాంతులుగల ముఖము, తెల్లని
తమ్మి రేకులవంటి కనులు గలిగినవాడు విభుడు.
 
తుమ్మెదలగుంపువంటి కొప్పు, మిక్కిలి మృదువైన భుజములు
గల్గినది దేవి. వర్ష కాలమేఘమువంటి జుట్టు, మిక్కిలి దృఢ
మైన భుజదండములు గలవాడు విభుడు.
 
అమృతమునకు నిలయమైన బింబోష్టము, అద్దములను మించి
ప్రకాశించు చెక్కిళ్లు గల్గినది దేవి. కాంతిగల తెల్లని దంత
ములు, వికసించిన పద్మములవంటి హ సముగలవాడు విభుడు.
 
re
 
ఓ శచీ ! అత్యంత రమ్యమైన యువతివై నీవు సుందరశరీర ము
గలిగి యౌవనవంతుడై, త్రిభువనపతియైన నింద్రునితో గూడితివి.
ఓ దేవీ! వికసించిన పుష్పములుగల మందార వృక్షవనపంక్తు
లందు విహరించుచు నీవు మన్మధు ననుగ్రహించుచుంటివి.
ఓ శచీ ! సీ ముంగురులందు బ్రకాశించు కల్పకపుష్పము
నూత్న మేఘ మధ్యమందు బ్రకాశించు నూత్న నక్షత్రము
వలె భాపించుచున్నది.
 
ఓ దేవీ ! ఏ యమరవృక్షము వికసించిన పుష్ప సంపత్తితో
నిన్ను భజించునో, అతరువు ఔదార్యమును, ఐశ్వర్యమును
గూడ (నీ వలన) బొందుచున్నది.