2023-07-29 17:16:11 by ambuda-bot

This page has not been fully proofread.

17.
 
18.
 
19.
 
20.
 
21.
 
22.
 
23.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
ఏ దేవికి సమానమగుస్త్రీ ముల్లోకములందు లేదో, అట్టి సుందరి,
నిత్య యౌవన,పురాతని యైన స్త్రీకి మేము నమస్కరింతుము.
 
97
 
ఏ దేవి పాదములకు గల సౌందర్యము మందార వల్లవములకు
గూడ లేదో, అట్టి సుంద రాతిసుందర
రములైన శచీ దేవి
పాదములను నే నాశ్రయింతును.
 
ఏ దేవి పద కాంతులు ప్రశస్త మాణిక్యములందైన లేవో,
భాసురమైన వానికంటె భౌసురమైన యా శచీ పాదములను
నే నాశ్రయింతును.
 
ఏ దేవీపాదములను చితించుటవలన నకుడు పాపములచే
తిరస్కరింపబడడో, అట్టి పవిత్రమైన వానికంటే పవిత్రమైన
శచీపాదములను నే నాశ్రయింతును.
 
ఏ దేవియొక్క నఖములందు రాజిల్లు చంద్రకాంతులు తమ
స్సును భారద్రోలుచున్నవో, అట్టి యింద్రాణీ పాదములకు
 
మంగళమగుగాక.
 
దేవతల కిరీట రత్న శాంతులచే కడగబడుచు బ్రకాశించుచున్న
ఇంద్రాణీ పాదములకు మంగళమగుగాక.
 
బాలసూర్య బింబమువలె భాసించునది, యోగీంద్రుల హృదయ
గుహలందు దీపించునది యైన ఇంద్రాణియొక్క పాదపద్మమునకు
 
మంగళమగుగాక.