2023-07-29 17:16:11 by ambuda-bot

This page has not been fully proofread.

5.
 
6.
 
7.
 
8.
 
9.
 
10.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
డనుట యే యు క్తము. పై శ్లోకమున భర్తతో విహరించు
నపుడు చంద్రముఖయనియు, నిందులో శత్రువులతో యుద్ధము
చేయునపుడు సూర్యునివలె జ్వలించు ముఖముకలది యనియు
జమత్కరించెను. "రా కేందు బింబమై రవిబింబమై" అను
పోతనగారి పద్యము స్మరింపఁదగును.)
 
93
 
123 334
 
నారిటం కారములచే రక్కసులకు భీతి గలిగించుచు దేవతలకు
T
ప్రీతినిచ్చు శచీదేవి విరాజిల్లుచున్నది.
 
దేవేంద్రునిశక్తిని ధరించునది, శత్రువుల ఆడంబరమును నివారిం
చునది, మునులకు ముక్తినిచ్చునది యగు శచీ దేవి నాకుశరణము
 
కృశించిన స్వ దేశమును దర్శించుటవలన, భిన్న మైన స్వజాతిని
వీక్షించుటవలన ఖన్నుడనైయున్న నాకు సంశ్రితులను రక్షించు
శచీ దేవి గతి యగుగాక.
 
సంఘము వెయ్యి విధములుకాగా, దేశము హీనస్థితినిబొంది
యుండగా శోకమందు మునిగియున్న నాకు లోకములను
కాపాడు శచీ దేవి గతి యగుగాక.
 
ఆమె జ్ఞానమున కధిదేవత. వరమైన స్వరమామెకు వశమై,
ఆమెచేత నే సర్వము విధింపబడుచున్నది గనుక శచి పరాదేవిగా
వచింపబడుచున్నది.
 
ఆమె యత్యంత సూక్ష్మరూపిణియైనను సర్వవస్తువులందు బ్రకా
to th C
శించుచున్నది. ఆమె నిరూపమానమైన ఆకాశమును కొలత
చేయుచున్నది. కనుక నే పరా దేవియని శచి వచింపబడుచున్నది.