2023-07-29 17:16:10 by ambuda-bot

This page has not been fully proofread.

స్త. 3.
 
7.
 
8.
 
9.
 
10.
 
11.
 
12.
 
13.
 
ఇంద్రాణీ సప్తశతీ
 
ఓ తల్లీ ! పవిత్రమైన నీ నామమును సుకృతియైన యేమనుజుడు
కీర్తన చేయునో వాని చరణములకు నే నెల్లప్పుడును దాసుడను.
 
87
 
ఓ పావనీ ! గొప్ప ప్రభావముగల ఆగమసారమైన నీ మంత్ర
మనెడి కూర నెవడుపాసించునో, వాని చరణములకు నేను
నమస్కరింతును.
 
ఓ దేవీ! అగ్ని, సముద్రములు కోణములుగా గల్గిన నీ పావన
యంత్రము నెవడు ప్రతిదినము పూజించునో, వాని పాదములను
నేను భజింతును.
 
ఓ యంబా ! శాంకబుద్ధిచే నితర సంకల్పసమూహమును
నశింపజేసి నీ పాదములనే చింతించు సత్పురుషులను నే ననుస
రింతును.
 
ఓ దేవీ! నిజతత్త్వమును శోధించు వారియొక్క, మహిమను
సాధించు వారియొక్క, నీ పాదములను ధ్యానించువారియొక్క
పాదములయొద్ద నేను చరింతును.
 
ఓ దేవీ ! ఎవడు తన దేహమందు ప్రవహించు నిన్ను సంతత
చింతనయోగముచే ననుభవించునో, వాని పాదములను నేను
సేవింతును.
 
ఓ యీశ్వరీ ! ప్రాణముయొక్క యా తాయాతముల నెవడు
చూచుచు కుండలినీ కులకుండమునుండి నిన్ను మేలుకొలుపునో
 
వానికి నా వందనములు.