This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనము
 
ix
 
Sri Matre Namah
 
Shivaya Gurave Namah
 
Sri Vishnurupaya Namassivaya
 
Samavedam Shanmukha Sarma
RUSHIPEETHAM
 
Sri Lalita Dhamam, Plot # 299/300, Phase-1 Saket Colony, ECIL Post, Secunderabad - 500062.
Mobile:9440382028; Email:samavedam@rushipeetham.org; Website: www.samavedam.org
8.20-05-2023.
 
బ్రహ్మశ్రీ కొల్లూరు అవతారశర్మగారు ఎన్నో ఆర్షకృతులను సవ్యాఖ్యానంగా
అందించి, సాధకజనులకు మహెూపకారం చేశారు. కవి- పండితులైన
ఈ మహనీయులు ఇప్పుడీ రచనద్వారా, హిందూజనులకు నిత్యానుష్ఠానాన్ని
ఋషిసంప్రదాయసిద్ధంగా అందించారు. "అందరికీ సంధ్యావందనం" అనే
పేరుతో వారి గురువుల ఉపదేశ ప్రేరణలతో, సాధనాబలంతో, తపశ్శక్తితో,
సర్వజనోపకారకంగా ఒక గొప్ప శాస్త్రాన్ని ప్రసాదించారు. ఇది
హిందువులందరూ అందుకోవాలి. హిందూజాతికి అనుష్ఠాన సంపత్తి
చేకూరాలి. అది భౌతిక, ఆధ్యాత్మికశక్తిని ప్రోదిచేస్తుంది.
 
'ప్రవేశిక' పేరుతో ఈ మహాశయులు వ్రాసిన ఉపోద్ఘాతమే ఒక శాస్త్రముగా
నిర్దేశితమైనది. శాస్త్రసంప్రదాయాలకు అవిరోధంగా, సాత్వికాచారబద్ధంగా,
ప్రామాణిక సద్గంథాలను మథించి, సంక్షేపసుందరంగా, నేటి దేశ కాల
పరిస్థితులకు అనుకూలంగా దీనిని సమకూర్చిన రీతి దివ్యమైనది.
 
ఇతరమతాలతో వీరి పద్ధతులను అనుసరించి అధికసంఖ్యాకులు
విశ్వాసపూర్వక అనుష్ఠానం చేస్తూ, నిబద్ధతతో, స్వాభిమానంతో ఉన్నారు.
ఆ మూడూ హిందువుల్లో లుప్తమయ్యాయి. ఆ లోటును తొలగించే విధంగా
ఈ శాస్త్రం రచింపబడింది. ఇది ఈశ్వర ప్రేరణ! ఋషులిచ్చిన స్ఫురణ!
బహుళ వ్యాప్తిగా ఈ గ్రంథం అనుష్ఠింపబడాలని ఆశిస్తూ-
బుధజనవిధేయుడు,
(సం. సామవేదం షణ్ముఖశర్మ)