This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనం
 
2. మనదేవుడికిప్పుడు స్నానం చేయిద్దాం. అని పిల్ల లేదా బాబుచే -
 
శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః
శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః।
 
శివాయ నమః శివాయ నమః - అని 10 సార్లు ఉద్ధరిణె లేదా చెంచాతో
శివునికి స్నానం చేయించాలి.
 
3. తరువాత మెత్తని వస్త్రముతో శివుని లింగము లేదా ప్రతిమను తడి
లేకుండా తుడిపించి విభూతి కుంకుమ బొట్టుపెట్టించాలి.
 
48
 
4. పిమ్మట
 
'శివాయ నమఃl'-అని పూవును శివునిపై పెట్టి నమస్కరించాలి.
'శివాయ నమఃః'-అని పూవును శివునిపై పెట్టి నమస్కరించాలి.
'శివాయ నమః'-అని పూవును శివునిపై పెట్టి నమస్కరించాలి.
'శివాయ నమః।'-అని పూవును శివునిపై పెట్టి నమస్కరించాలి.
'శివాయ నమః।'-అని పూవును శివునిపై పెట్టి నమస్కరించాలి.
ఇలా ఐదుసార్లు పూవులతో పూజ చేసి తరువాత-
సిద్ధపరచిన ఇష్టనైవేద్యమును భగవానునకు సమర్పించి, ముందుగా
ఎదుటనున్నవారికి ఇప్పించి, తరువాత పిల్లలు తినేలా వారికి బోధించాలి.
(ఆంజనేయుని పూజిస్తే-'ఆంజనేయాయ నమః' అని పూజించాలి. బాలికలచే
సరస్వతీ, లక్ష్మీ, సీత వంటి విగ్రహాలకు పూజచేయించవచ్చును)
ఇక్కడితో సంధ్యావందన భాగం పూర్తయినట్లే.
 
పిల్లలకు ఉదయం సాయంకాలం పాడుకోడానికి అనువుగా వీలైనన్ని-
ప్రార్థనాశ్లోకాలు, స్తోత్రాలు, భజనలు లాంటివి, ఇంకా చిన్న చిన్న నీతికథలు,
పురాణకథలు, దేశభక్తులకథలు బోధించాలి. దానివల్ల వారికి చక్కని
శీలసంపదను అందించినవాళ్లమవుతాం. సుమతీశతకం, కృష్ణశతకం వంటి
శతకాలు,కూడా బోధించడం మంచిది.
 
దిశానిర్దేశంగా