This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనము
 
ఓమ్
 
'మహామహెూపాధ్యాయ'
'రాష్ట్రపతిపురస్కారసమ్మానిత' 'ఆంధ్రభాషాభూషామణి'
ప్రాచార్య శలాక రఘునాథశర్మ
 
vii
 
శోభకృద్వైశాఖకృష్ణత్రయోదశీ,బుధవారం.
 
బహుమానము
 
అస్మత్రియ సుహృద్వరులు బ్రహ్మశ్రీవేదమూర్తులు కొల్లూరు అవతారశర్మగారు
సలక్షణంగా రూపొందించి మానవ సమాజానికి అందిస్తున్న 'అందరికీ
సంధ్యావందనం' అన్న చిరుపొత్తాన్ని మెలకువతో అనుశీలించాను. చాలా ఆనందం
 
కలిగింది.
 
నిరంతరమూ విశ్వశ్రేయస్సును కోరటం విప్రుని విధి. తగిన మార్గనిర్దేశం
చేయటం విప్రుని కర్తవ్యం. ఎప్పటికప్పుడు ఋషులు మనకు అనుగ్రహించిన
ఉదాత్త ఉత్తమ ఆశయాలు ఆచరణలో పెట్టించటం విప్రుని సదాచారం. శ్రీశర్మగారు
నాకు తెలిసినప్పటినుండీ వీనిని విస్మరించకుండా, శ్రద్ధాసక్తులతో
నిత్యకర్మానుష్ఠానంలాగా ఆచరిస్తూనే ఉన్నారు.
 
"ఆచినోతి హి శాస్త్రాణి ఆచారే స్థాపయత్యపి।
 
స్వయమాచరతే యస్తు స ఆచార్య ఇతి స్మృతః॥" అన్న శ్లోకార్థానికి
సమన్వయరూపమైన వ్యక్తిత్వం శ్రీ అవతారశర్మ గారిది.
 
"అందరికీ సంధ్యావందనం" అనే శీర్షికతో వెలువడుతున్న ఈవాఙ్మయ
పుటిని హృదయపేటికలో భద్రపరచుకొంటే, 'సర్వ' శబ్దవ్యవహారానికి
యోగ్యతకలవారవుతారు. "సర్వః" అంటే పరమాత్మ. ఇంతకంటే మానవజీవితానికి
సాఫల్యము ఏమి ఉంటుంది? శ్రీశర్మగారిని మనసారా అభినందిస్తూ సెలవు
 
తీసుకుంటాను.
 
సం. శలాక రఘునాథశర్మ
 
జ్ఞానపూర్ణిమ. 75-1-3 ఏ-5. బ్లూమూన్ గృహసముదాయం ప్రకాశంనగర్
రాజమహేంద్రవరం.పిన్.నం-533103. (ఆం.ప్ర) ఫోన్లు-సెల్లు-986608542. ఇల్లు-08832432906.