This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనం
 
చతురస్రాకారపుచాప, పిల్లలు ఇష్టపడే ఒక చిన్న శివలింగం/శివుడు/
హనుమంతుడు/రాముడు/కృష్ణుడు మరేదైనా చిన్ని కులదేవతా విగ్రహం, ఒక
మెత్తని వస్త్రము, కొద్దిగా విభూతి, కుంకుమ, కొద్దిగా పూవులు, నైవేద్యానికి
పిల్లలకు ఇష్టమైన పండ్లు, పాలు, బోర్న్ వీటాలాంటి పానీయాలు,
వివిధ ఫలరసములు, ఐస్క్రీమ్, చాక్లెట్స్.... వగైరాలను మార్చి మార్చి
సమకూర్చుకోవాలి.
 
ముందుగా సూర్యుణ్ణి చూపించి నమస్కారం చేయించాలి.
ఐదేండ్లుదాటిన పిల్లలైతే-
మిత్రాయ నమః।రవయే నమః॥సూర్యాయ నమః।భానవే నమః।
ఖగాయనమః।పూర్ణేనమః హిరణ్యగర్భాయ నమః।మరీచయే నమః।
ఆదిత్యాయ నమః।అత్రిణే నమః। అర్కాయనమః। భాస్కరాయనమః -
అని 12మంది ఆదిత్యులకునమస్కారం చేయించాలి.
 
(ముందుగా చెంబులోని నీళ్లు పంచపాత్ర లేదా గ్లాసులోకి తీసుకుని, ఒక
పళ్లెంలో శివలింగం/ఆంజనేయుడి బొమ్మను, రెండవ పళ్ళెంలో నీళ్లు
నింపుకున్న పంచపాత్ర లేదా గ్లాసును ఉంచి దానిలో ఉద్దరిణె/ చెంచాను
సిద్ధంగా ఉంచుకోవాలి. తరువాత
 
46
 
1. మనమిప్పుడు మన చిన్ని శివునికి,లేదా ఆంజనేయునికి స్నానం చేయిద్దాం.
అని వారిని అందుకు సంసిద్దులను చేయాలి.
 
2. మన దేవుడికిప్పుడు స్నానం చేయిద్దాం. అని పిల్ల లేదా బాబుచే -
శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః।
 
శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః
 
శివాయ నమః। శివాయ నమఃః - అని 10 సార్లు ఉద్ధరిణె లేదా చెంచాతో
శివలింగం/ఆంజనేయుడికి స్నానం చేయించాలి.
 
3. తరువాత మెత్తని వస్త్రముతో శివలింగం/ఆంజనేయుని ప్రతిమను తడి
లేకుండా తుడిపించి, విభూతి కుంకుమ బొట్టుపెట్టించాలి.