This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనం
 
తల్లిదండ్రులకు మనవి- మనమందరం పిల్లలు చక్కని విద్యాబుద్ధులు
కలిగి ఆయురారోగ్యాలతో రోజురోజుకూ వృద్ధిపొందుతూ ఉండాలని
కోరుకుంటాం. వారి వికాసం మనకు, సమాజానికి, దేశానికీ,
యావత్ప్రపంచానికీ కూడ అవసరం. అందుకోసం మనం శిశుదశ అంటే,
మూడేళ్ల వయసునుండి పిల్లలను చక్కగా తీర్చి దిద్దుకోవాలి. అందుకని
తల్లిదండ్రులిరువురుగాని లేదా కనీసం వారిలో యే ఒక్కరైనాగాని వారితో
రోజూ ఉదయం సాయంత్రం కనీసం 15 నిమిషములు సరదాగా తమ
జీవనశైలి (LIFESTYLE)లో కొద్దిమార్పులు చేసుకుంటూ వారి వ్యక్తిత్వవికాసం
(PERSONALITY DEVELOPMENT) కోసం తప్పనిసరిగా వారితో గడపాలి.
లేకుంటే మనం ప్రత్యక్షంగా మన పిల్లలకు, పరోక్షంగా సమాజానికీ, దేశానికీ,
యావత్ప్రపంచానికీకూడ ద్రోహం చేసినవారమౌతాం. అందుకని
లోకకల్యాణము, విశ్వశాంతిని కోరుకుంటూ-
ముఖ్యగమనిక– వారికి ప్రతివస్తువులోను ప్రతివ్యక్తిలోను భగవత్తత్త్వమును
చూపించే ప్రయత్నం నిరంతరంచేయాలి. అదంత కష్టమైన పనేమీ కాదు.
పిల్లవాడు చూస్తున్న ప్రతివస్తువు భగవంతుడేనని వానికి తెలియజెప్పాలి.
ఎలాగంటే, వాడి ఇష్టదైవం హనుమంతుడు అనుకుంటే, ఎదురుగా కనిపిస్తున్న
వస్తువును చూపించి, ఇదేమిటని అడగండి. వాడు కుర్చీ అన్నాడనుకుందాం.
అది కుర్చీఅనబడే హనుమంతుడు. దానిలో హనుమంతుడు కనబడకుండా
ఉన్నాడు. అలాగే వాడుచూస్తున్న ప్రతివస్తువును పుస్తకమనబడే హనుమంతుడు,
స్తంభమనే హనుమంతుడు,..అని, ఆవిధంగానే చూస్తున్న ప్రతీ వ్యక్తిని అమ్మ
అనే హనుమంతుడు, తమ్ముడనే హనుమంతుడు,... అని పరిచయం చెయ్యాలి.
క్రమంగా కొద్ది కాలంలో వాడికి అన్నిటిలోను, అంతటా హనుమంతుడు
ఉన్నాడనే జ్ఞానము కలుగుతుంది. అది క్రమంగా స్థిరపడి అతనికి అంతటా
హనుమంతుడే కనిపిస్తాడు. ఈ దృష్టి పిల్లలలో కలిగేలా వారికి బోధచేయడం
 
44